సహస్ర హత్య కేసులో షాకింగ్ విషయాలు వెల్లడించిన సీపీ – Sahasra Murder Case
Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్తవాలు మీడియాకు వెల్లడించారు. 14 ఏళ్ల పిల్లాడే తన ఇంటి పక్కన ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సహస్ర తమ్ముడితో తరచూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాలని నిర్ణయించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే సహస్ర ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే సమయంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంటనే సదరు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగకుండా కత్తితో పాశవికంగా పొడిచేశాడని పోలీసులు వెల్లడించారు.
మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్...




