Sarkar Live

National

Pak Provocation | పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. స‌రిహ‌ద్దుల్లో కాల్పులు
National

Pak Provocation | పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. స‌రిహ‌ద్దుల్లో కాల్పులు

Pak Provocation : భారతదేశానికి, పాకిస్తాన్ మధ్య (India and Pakistan) స‌రిహ‌ద్దుల్లో ఘ‌ధ్య మళ్లీ ఉద్రిక్తత వాతావరణం చోటుకుంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది (Violating the ceasefire agreement repeatedly). వరుసగా నాలుగో రోజు కూడా ఇండియా సరిహద్దులో కాల్పులు జరిపింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల దగ్గర ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (Line of Control (LOC) వెంబడి పాకిస్తాన్ సైన్యం ఆదివారం అర్ధ‌రాత్రి కాల్పులకు (Pakistani army engaged in firing) తెగబడింది. దీనిపై భారత సైన్యం వెంటనే స్పందించింది. ప్ర‌తీగా ఎదురు కాల్పుల‌కు దిగింది. Pak Provocation : తిప్పికొట్టిన భార‌త్‌ కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో ఈ రెండు ప్రాంతాల్లో ఎల్‌ఓసీ దగ్గర పాకిస్తాన్ సైన్యం చిన్న తుపాకులతో పాటు ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపింది. భ...
Jammu and Kashmir | క‌శ్మీర్‌లో ముష్క‌రుల కుట్ర భ‌గ్నం..
National

Jammu and Kashmir | క‌శ్మీర్‌లో ముష్క‌రుల కుట్ర భ‌గ్నం..

Jammu and Kashmir : జమ్మూ క‌శ్మీర్‌లో దారుణమైన దాడికి పాల్పడిన లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాదుల (Lashkar-e-Taiba (LeT) terrorists )తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తుల ఇళ్లను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీ చేయ‌గా భారీ కుట్ర బ‌హిర్గ‌త‌మైంది. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకోగా అధికారులు శుక్రవారం వెల్ల‌డించారు. త‌నిఖీ చేస్తుండ‌గానే పేలుడు పహల్గాం (Pahalgam) దాడి కేసులో ప్రధాన నిందితుడ‌9 ఆదిల్ హుస్సేన్ తొకార్ , మరో అనుమానిత ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు సోదాలు చేశాయి. తనిఖీలు చేస్తుండ‌గా పేలుడు సంభవించింది. ఈ ఇద్దరూ లష్కరే తోయిబా (Lashkar-e-Taiba )కు చెందినవారేన‌ని తెలుస్తోంద. పేలుళ్లలో ఇద్ద‌రి ఇళ్లూ పూర్తిగా ధ్వంసమయ్యాయి. భద్రతా బలగాలు తనిఖీకి వచ్చినప్పుడు పేల్చేందుకు ముందుగానే బాంబులు అమర్చి ఉంచినట్లు అక్క‌డి దృశ్యాన్ని చూస్తుంటే స్పష్టమవుతోంది. Jammu and Kashmir : ముమ్మ‌రంగా సోదాలు ...
Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..
National

Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్క‌డ ఉండొద్దు ..

Pahalgam attack : జమ్మూ క‌శ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్య‌త‌ను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై ప‌లు ఆంక్ష‌లను విధించింది. Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు ఢిల్లీ‌లో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ 'Persona Non Grata' అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగ...
Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Crime, National

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది. ఇద్దరు విదేశీయులు కూడా.. ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...
Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..
National

Training aircraft crash : జ‌నావాసాల మధ్య కూలిన విమానం..

Training aircraft crash : గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లా (Gujarat’s Amreli district)లో ఈ రోజు ఓ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. ఒక ప్రైవేట్ విమానయాన శిక్షణ సంస్థకు చెందిన చిన్నవిమానం (small aircraft) జ‌నావాసాల మ‌ధ్య కుప్పకూలింది (crashed). ఈ ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్ (trainee pilot) అనికేత్ మహాజన్ (Aniket Mahajan) మృతి చెందాడు. దీంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ఒక్కసారిగా భూమి వైపు దూసుకొచ్చి కుప్పకూలిపోయింద‌ని స్థానికులు తెలిపారు. భూమికి ఢీకొట్టిన సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ శబ్దం విని చుట్టుపక్కల వారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. Training aircraft crash : ఎందుకు.. ఎలా? విమానం కూలిన ప్రదేశం నుంచి భారీగా మంటలు ఎగిసిపడిన దృశ్యం అందరినీ కలవరపరిచింది. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్లు ప్రారంభించారు. అయితే, ఎంత ...
error: Content is protected !!