Bridge Collapse | 10 మంది మృతికి కారణమైన బ్రిడ్జి ఎలా కూలిపోయింది.. ?
Bridge Collapse : గుజరాత్ లోని ఆనంద్ – వడోదర జిల్లాలను కలిపే గంభీర వంతెనలోని ఒక భాగం పద్రా తాలూకాలోని ముజ్‌పూర్ గ్రామం సమీపంలో కూలిపోవడంతో రెండు ట్రక్కులు, ఒక బొలెరో SUV, ఒక పికప్ వ్యాన్ సహా నాలుగు వాహనాలు మహిసాగర్ నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్‌లో తొమ్మిది మందిని రక్షించారు. సంజయ్ సింగ్ డీసీ, యు/సి ఇన్‌స్పెక్టర్ కృష్ణ కుమార్ పర్యవేక్షణలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
గంభీర వంతెన నాలుగు దశాబ్దాలకు పైగా మధ్య గుజరాత్, సౌరాష్ట్ర మధ్య కీలకమైన లింక్‌గా పనిచేసింది.ఈ ఆకస్మిక కూలిపోవడం వల్ల ఆనంద్, వడోదర, భరూచ్, అంకలేశ్వర్ మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి. ఈ కారిడార్ రోజువారీ ప్రయాణికులు, వస్తువుల రవాణా, మధ్య గుజరాత్ – సౌరాష్ట్ర మధ్య అంతర్-జిల్లా కనెక్టివిటీకి కీలకమైనది. ప్రతిరోజూ ప్రయాణీకులు, కార్గో వాహనాలతో ఈ వంతెన నిత్యం రద్దీగా ఉ...