ACB Raids | ఏసీబీ రైడ్ కలకలం…
రవాణా శాఖ డిటిసి పై ఏసీబీ దాడులు
ఏకకాలంలో 3 చోట్ల సోదాలు చేస్తున్నట్లు ప్రచారం..?
ACB Raids | తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు యమ స్పీడు మీద ఉన్నారు. చిన్న క్లూ దొరికితే చాలు అక్రమారుల భరతం పడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రవాణా శాఖలో ఇప్పటికే పలుమార్లు అనేక జిల్లాల్లో దాడులు చేసి కొంతమంది అవినీతి అధికారులను జైలుకు పంపించిన అధికారులు.. ఈరోజు ఉదయమే హన్మకొండలోని రవాణా శాఖ (RTA)లోని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్ళల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, జగిత్యాల హన్మకొండ లోని ఆయనకు చెందిన ఇండ్లలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు.
కాగా ఇప్పటికే పుప్పాల శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. రవాణా శాఖ లో డిటిసి స్థాయి అధికారిపై ఏసీబీ రైడ్స్ జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశం కాగా.. ర...




