Sarkar Live

Special Stories

Special Stories

ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam
Special Stories

ప్రైవేట్ పాఠశాలకు ‘రైతుబంధు’.. విద్యాసంస్థ భూమికి వ్యవసాయ పట్టా! – Rythu Bandhu Scam

​రెవెన్యూ అధికారుల అండతో ఖజానాకు గండి.. వరంగల్ జిల్లా ధర్మారంలో వెలుగుచూసిన వైనం ​Private School Rythu Bandhu Scam | విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాసంస్థ అధినేతలే అక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల అండదండలతో వ్యవసాయేతర భూమిని వ్యవసాయ భూమిగా రికార్డుల్లో చూపిస్తూ.. ఏకంగా 'రైతుబంధు', 'రుణమాఫీ' వంటి ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందుతున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ధర్మారం రెవెన్యూ శివారులో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. ​నాలా (NALA) భూమికి పట్టా ఎలా? ​నిబంధనల ప్రకారం.. విద్యాసంస్థలు లేదా ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే భూమిని వ్యవసాయేతర భూమి (నాలా) కింద మార్చాల్సి ఉంటుంది. గీసుగొండ మండలం ధర్మారం శివారులో సదరు పాఠశాల యజమాని ఒక ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ఇప్పటికే నాలా అనుమతులు కలిగి ఉన్నారు. అయితే, ఇక...
అడవి బిడ్డ నుంచి అసెంబ్లీ వరకు.. మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రస్థానం!  – Minister Seethakka Journey
Special Stories

అడవి బిడ్డ నుంచి అసెంబ్లీ వరకు.. మంత్రి సీతక్క స్ఫూర్తిదాయక ప్రస్థానం! – Minister Seethakka Journey

Minister Seethakka Journey | "ఒకప్పుడు అడవి మార్గాల్లో అన్యాయంపై తుపాకీ ఎక్కుపెట్టిన చేతులు.. నేడు అవే అడవి బిడ్డల భవిష్యత్తును మార్చే కలం పట్టాయి. నక్సలైట్ నుంచి న్యాయవాదిగా, పీహెచ్‌డీ స్కాలర్‌గా, ప్రజా నాయకురాలిగా, నేడు రాష్ట్ర మంత్రిగా ఆమె సాగించిన ప్రయాణం అసాధారణం. అడవి బిడ్డల ఆరాధ్య దైవం, ములుగు ముద్దుబిడ్డ ధనసరి అనసూయ అలియాస్ సీతక్క స్ఫూర్తిదాయక జీవన ప్రస్థానంపై సర్కార్ ప్రత్యేక కథనం." ​బాల్యం ‌‌– పోరాట పథం ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలోని ఒక సాధారణ ఆదివాసీ కోయ కుటుంబంలో 1971, జూలై 9న ద‌న‌స‌రి అన‌సూయ జన్మించారు. చిన్నతనంలోనే గిరిజనుల కష్టాలను, సామాజిక అన్యాయాలను కళ్లారా చూసిన ఆమె, వాటిని ఎదిరించడానికి 14 ఏళ్ల వయసులోనే (1987లో) జనశక్తి నక్సల్ గ్రూపులో చేరారు. అడవిలో దళ కమాండర్‌గా దాదాపు 11 ఏళ్ల పాటు అజ్ఞాతవాసం గడిపిన అన‌సూయ‌ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అనంతర కాలంలో తన బావ శ...
నిరుద్యోగుల ఆశలపై ‘ఔట్ సోర్సింగ్’ డేగ కన్ను కోట్లు కొల్లగొట్టేందుకు ఏజెన్సీల స్కెచ్! – Outsourcing Jobs Scam
Special Stories

నిరుద్యోగుల ఆశలపై ‘ఔట్ సోర్సింగ్’ డేగ కన్ను కోట్లు కొల్లగొట్టేందుకు ఏజెన్సీల స్కెచ్! – Outsourcing Jobs Scam

Outsourcing Jobs Scam | రాష్ట్రంలో ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏజెన్సీలకు సంబంధించి అధికారిక ప్రొసీడింగ్స్ వెలువడక ముందే, తెరవెనుక దందా మొదలైనట్లు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ లోని హన్మకొండ, వరంగల్, మహబూబాద్,ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వీరి దందా జోరుగా సాగించేందుకు ఇప్పటికే కసరత్తు చేసినట్లు ఓ ఏజెన్సీ నిర్వాహకుడు "సర్కార్ లైవ్" ప్రతినిధితో అన్నారు. ​పది రోజుల్లో ప్రొసీడింగ్స్.. వెనువెంటనే నియామకాలు ​రాష్ట్రంలోని పలు కీలక శాఖల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. మరో పది రోజుల్లో ఎంపిక చేసిన...
కట్టమల్లన్న సాక్షిగా.. అక్రమ నిర్మాణాల జాతర.. ‌‌– Illegal Constructions
Special Stories

కట్టమల్లన్న సాక్షిగా.. అక్రమ నిర్మాణాల జాతర.. ‌‌– Illegal Constructions

జీడబ్ల్యూఎంసీ నోటీసులు 'కాగితాలకే' పరిమితమా? 16వ డివిజన్‌లో ఆగని అక్రమ నిర్మాణాలు! ​GWMC Illegal Constructions in Keerthi Nagar | గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 16వ డివిజన్ ప్రస్తుతం అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నిబంధనలను బేఖాతరు చేస్తూ, అధికారుల కళ్లు గప్పి కొందరు యథేచ్ఛగా కట్టడాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కట్టమల్లన్న ఆలయానికి సరిగ్గా ఎదురుగానే, మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా భారీ ఎత్తున నిర్మాణాలు (Illegal Constructions) సాగుతుండటం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ​నోటీసులకే పరిమితం.. చర్యలు ఎక్కడ? ​ఈ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు రావడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు నామమాత్రంగా స్పందించారు. సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్ర...
వామ్మో శేఖర్.. Revenue Broker ! ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్న ‘సర్కార్ లైవ్’ కథనాలు
Special Stories

వామ్మో శేఖర్.. Revenue Broker ! ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలకలం రేపుతున్న ‘సర్కార్ లైవ్’ కథనాలు

​Warangal Revenue Scam | ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ శాఖలో ఒక పేరు ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. అదే "రెవెన్యూ బ్రోకర్ (Revenue Broker) శేఖర్". సామాన్య ప్రజల భూ సమస్యల నుంచి బడా రియల్టర్ల సెటిల్మెంట్ల వరకు అన్నింటిలోనూ తనదైన ముద్ర వేస్తూ, సమాంతర వ్యవస్థను నడుపుతున్న శేఖర్ లీలలపై ‘సర్కార్ లైవ్’ ప్రచురించిన వరుస కథనాలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ​రెవెన్యూ రాజ్యాంగం.. శేఖర్ కబంధ హస్తం! ఉమ్మడి వరంగల్ ​జిల్లాలోని ఏ రెవెన్యూ ఆఫీస్‌కు వెళ్లినా, ఏ టీ స్టాల్ దగ్గర చూసినా ఇప్పుడు ‘శేఖర్’ గురించిన చర్చలే నడుస్తున్నాయి. రెవెన్యూ చట్టాలను తుంగలో తొక్కి, తనకంటూ ఒక ప్రత్యేక ‘రాజ్యాంగాన్ని’ ఏర్పాటు చేసుకుని చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ ఆఫీస్ మొదలుకొని కలెక్టరేట్ వరకు శేఖర్ కబంధ హస్తాలు చాచాడని, అధికారులు కూడా అతడి మాటకు తలొగ్గ...
error: Content is protected !!