TGSRTC | సజ్జనార్ సార్ మెడికల్ ఆఫీసర్ ని మార్చండి…
వరంగల్ రీజియన్ మెడికల్ ఆఫీసర్ ను మార్చాలని వేడుకుంటున్న ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ ఉద్యోగులపై ఆ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు
ఔట్ సోర్సింగ్ డాక్టర్ ఆర్టీసీ ఉద్యోగులను చిన్నచూపు చూస్తున్నట్లు ప్రచారం.
సమస్య ఉందని సంప్రదిస్తే.. అధికారులకు ఫోన్ చేసి సిక్ ఇవ్వాలా?వద్దా ?అని అధికారులను అడుగుతోందని ఆరోపిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
Warangal | ఆర్టీసీ(TGSRTC)లో ఆ మెడికల్ ఆఫీసర్ తమను చిన్నచూపు చూస్తుందని కనీసం తమకు ఏదైనా సమస్య (ఇబ్బంది) ఉంది. మాకు సిక్ లీవ్ కావాలని డాక్టర్ ను సంప్రదిస్తే కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆర్టీసీ ఉద్యోగులతోపాటు, రిటైర్డ్ కార్మికులు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక లోలోపల మదనపడుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వరంగల్ రీజియన్ లో మెడికల్ ఆఫీసర్ గా(Medical Officer) ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న సదరు డాక్టర్ తన వద్దకు వచ్చే ఆ...