Warangal : కొండాను ఢీ కొట్టగలరా…?
ఫైర్ బ్రాండ్స్‌ను రాజకీయంగా డిస్టర్బ్ చేయడంలో అంతర్యమేమిటో?
కొండాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నదెవరు?
ఎదురించేదిలేదు..? ఢీ కొట్టేది ఉండదు..? కానీ లాబీయింగ్ లో మాత్రం ముందుంటారు..?
Warangal : అధికారంలో ఉన్నా లేకున్నా.. పదవులు వచ్చినా రాకపోయినా.. నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారితో మమేకమవుతూ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దీటుగా ఎదుర్కొంటూ ప్రజల గుండెల్లో సుస్థిరంగా నిలిపోయారు కొండా దంపతులు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చోటుసంపాదించుకున్నారు ఈ సీనియర్ మాస్ లీడర్లు.. రాజకీయ ప్రత్యర్థులు సైతం కొండాను ఢీ కొట్టాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారంటే వారు ఎంతటి పవర్ ఫుల్ లీడర్లో అర్థం చేసుకోవచ్చు. అలాంటిది కొండా మురళి (Konda Murali) సతీమణి కొండా సురేఖ (Konda Surekha) ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం(...




