KCR key decision : BRS వరుస పరాజయాలు.. దిద్దుబాటు చర్యలపై కేసీఆర్ ఫోకస్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల (Telangana politics)లో ఒకప్పుడు దుమ్మురేపిన పార్టీ BRS. ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. వరుస పరాజయాల (BRS party losses)తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదేళ్లు ఏకదాటిగా అధికారంలో ఉన్న ఈ ఉద్యమ పార్టీ వెనుకబడిపోయింది. ముఖ్యంగా అసెంబ్లీ, పార్లమెంట్, మునిసిపల్ ఎన్నికల్లో ఓటములను చవి చూసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election result)లోనూ అదే పరిస్థితి ఎదురైంది.
వరుస పరాజయాలకు కారణాలు ఇవేనా?
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నో సంస్కరణలు చేపట్టిన BRS.. ప్రజాదరణ పొందింది. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల్లో మంచి ఇమేజ్‌ను సంపాదించుకుంది. అయితే.. ఏ పార్టీ అయినా ఎప్పటికీ అదే స్థాయిలో ప్రజాదరణను నిలబెట్టుకోవడం కష్టమే. ప్రభుత్వంపై వ్యతిరేకత, వ్యవస్థపై అసంతృప్తి, కొత్త నాయకత్వ అవసరం వంటి అంశాలు ఏదో ఒక దశలో ముందుకు వస్తాయి. ...




