Skip to main content

Sarkar Live

Special Stories

Special Stories

​అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా: అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..!
Special Stories, State

​అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా: అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..!

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఎప్పుడు ఎవరిపై రైడ్ జరుగుతుందోనని అధికారుల్లో టెన్షన్ టెన్షన్! ​వరుస దాడులు, ఆకస్మిక తనిఖీలతో లంచావతారులకు నిద్ర కరవు. తెలంగాణలో అవినీతిని కూకటివేళ్లతో పెకలించేందుకు యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) రూట్ మార్చింది. లంచగొండుల ఆట కట్టించేందుకు అధికారులు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలోని అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా ఏసీబీ అడుగులు పడుతుండటంతో.. ఎప్పుడు ఎవరిపై రైడ్ జరుగుతుందో తెలియక అక్రమార్కులు బిక్కుబిక్కుమంటున్నారు. ​కూకటివేళ్లతో కదులుతున్న అక్రమాస్తుల పుట్టలు.. ​గడిచిన కొన్ని రోజులుగా ఏసీబీ జరుపుతున్న వరుస దాడులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో కేవలం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారిపైనే చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్...
Corruption | ముడుపులు ముడితే ‘సర్వే’ తారుమారు.. అటెండర్ టూ డీఐ ప్రస్థానం వెనుక మర్మమేంటి?”
Special Stories

Corruption | ముడుపులు ముడితే ‘సర్వే’ తారుమారు.. అటెండర్ టూ డీఐ ప్రస్థానం వెనుక మర్మమేంటి?”

​అటెండర్ టు డీఐ.. సదరు అధికారి ప్రమోషన్లపై గుసగుసలు ​25 ఏళ్లుగా ఒకే జిల్లాలో తిష్ఠవేసిన డీ ఐ ​రెవెన్యూ గెస్ట్ హౌస్ కేంద్రంగా సెటిల్మెంట్లు? ​ముచర్ల భూముల్లో రైతులపై ప్రతాపం.. బదిలీ ఆపుకునేందుకు పాట్లు ​Revenue DI Corruption Survey Numbers Tampering | సదరు అధికారికి ముడుపులు ముడితే చాలు.. వివాదాస్పద భూముల సర్వే నెంబర్లు మారిపోతాయి, రికార్డుల్లో మ్యాపులు తారుమారైపోతాయి! బాధితులు లబోదిబోమన్నా పట్టించుకునే నాథుడే లేడు. అటెండర్ స్థాయి నుంచి జిల్లా ఇన్‌స్పెక్టర్ (డీఐ) స్థాయికి ఎదిగిన సదరు అధికారి వ్యవహార శైలిపై ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఒకే జిల్లాలో పాతుకుపోయి, బదిలీ రాకుండా చక్రం తిప్పుతున్న ఆ అధికారి లీలలపై ప్రత్యేక కథనం. ​ఉద్యోగం చేస్తూ కాలేజీకి ఎప్పుడెళ్లారు? ​అటెండర్ ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించిన సదరు అధికారి, ఆ తర్వాత వరుస ప్రమోషన్లతో డీఐ స్...
​ధాన్యంలో కోత.. అధికారులకు మేత!
Special Stories

​ధాన్యంలో కోత.. అధికారులకు మేత!

​రైతులకు నష్టం.. మిల్లర్లకు లాభం ​ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిలువుదోపిడీ ​మిల్లర్లతో కుమ్మక్కైన నిర్వాహకులు, అధికారులు ​పట్టించుకోని యంత్రాంగం.. కన్నీరు పెడుతున్న అన్నదాత ​Paddy Procurement Scam | ఆరుగాలం శ్రమించి, చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే అన్నదాతకు గుండెకోత మిగులుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో (ఐకేపీ/పీఏసీఎస్) అడుగడుగునా దోపిడీ సాగుతోంది. "ధాన్యంలో కోత.. అధికారులకు మేత" అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వింటాలుకు 40.700 కిలోల చొప్పున తూకం వేయాల్సి ఉండగా, తాలు, తరుగు, తేమ పేరుతో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై రైతు గొంతు కోస్తున్నారు. ​క్వింటాలుకు 2 నుండి 5 కిలోల కోత! ​ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంటను కాంటా వేసే సమయంలోనే తరుగు పేరుతో క్వింటాలుకు 2 నుండి 5 కిలోల వరకు అదనంగా తూకం వేస్తున్నారు...
​టార్గెట్ 2034: రేవంత్ రెడ్డి ‘ఢిల్లీ’ ప్లాన్!
Special Stories

​టార్గెట్ 2034: రేవంత్ రెడ్డి ‘ఢిల్లీ’ ప్లాన్!

​రాహుల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యం.. జాతీయ రాజకీయాలపై సీఎం హాట్ కామెంట్స్ ​తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యూహాత్మక నేత. ఆయన వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే సృష్టిస్తుంది. తాజాగా ఒక మీడియా కాన్‌క్లేవ్‌లో తన పొలిటికల్ ఫ్యూచర్ మ్యాప్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి. తాను ఎల్లకాలం తెలంగాణ సీఎం సీటుకే పరిమితం కానని, 2034 నాటికి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ను, ప్రత్యర్థి పార్టీల్లో సరికొత్త చర్చను రేకెత్తిస్తున్నాయి. ​పదేళ్ల సుస్థిర పాలన.. ఆపై జాతీయ యవనికపైకి! ​రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఆయన ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో (Goal-orien...
కొమ్మాల అంగడిలో వసూళ్ల పర్వం: రైతుల జేబుకు చిల్లు.. కాంట్రాక్టర్ల జేబులు ఫుల్!  Kommala Cattle Market Scam
Special Stories

కొమ్మాల అంగడిలో వసూళ్ల పర్వం: రైతుల జేబుకు చిల్లు.. కాంట్రాక్టర్ల జేబులు ఫుల్! Kommala Cattle Market Scam

​వరంగల్ జిల్లా గీసుగొండ మండల పరిధిలోని కొమ్మాల అంగడి (Warangal Kommala Cattle Market) లో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న వసూళ్లు చర్చనీయాంశంగా మారాయి. అంగడికి వచ్చే అమాయక రైతుల నుంచి కాంట్రాక్టర్లు డబుల్ వసూళ్లకు పాల్పడుతూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారు. అధికారికంగా ఉండాల్సిన ఫీజుల కంటే రెట్టింపు వసూలు చేస్తూ, కాంట్రాక్టర్లు కాసుల వేటలో పడ్డారు. ​Kommala Cattle Market : నిబంధనలు గాలికి.. వసూళ్లు జోరుగా.. ​సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు రుసుము చెల్లించి రైతులు తమ పశువులను అంగడిలో విక్రయించుకోవాలి. కానీ, కొమ్మాల అంగడిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయించి, రైతుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. ​అధికారుల మౌనం.. లోపాయకారి ఒప్పందం...
error: Content is protected !!