MVI | ఎంవీఐల ద్విపాత్రాభినయం:
ఆర్టీఓలు లేకపోవడంతో రవాణా శాఖ గాడితప్పుతున్నదా?
రాష్ట్రంలో సగానికి పైగా రవాణా శాఖ కార్యాలయాల్లో "ఆర్టీఓ"ల కొరత
ఆర్టీఓ లను నియమించేదెన్నడు..? ఈ శాఖను గాడిలో పెట్టేదెప్పుడు..
రవాణా శాఖ (Telangana Transport Department) లో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI)లు డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లా రవాణా శాఖ కార్యాలయాల్లో ఆర్టీఓ ల కొరత కారణంగా ఒక్కో అధికారి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో సగానికి పైగా "ఆర్టీఓ"లు లేరని దాంతో కార్యాలయాల్లోని ఎంవీఐ లకే "డిటివో" లుగా అదనపు బాధ్యతలు అప్పజెప్పడంతో ఎంవీఐ లకు అదనపు భారం పడుతున్నట్లు మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాపోతున్నారు.కొంతమంది ఇలా భాధపడితే మరికొంతమంది ఇదే అదునుగా డబుల్ బొనాంజా( ఎంవీఐ కమ్ డిటివో ప్రకారం రోజు వారి అక్రమ వసూళ్లు) పొందుతున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయ...