Sarkar Live

Special Stories

Special Stories

​Private School Fee | బడులు తెరుచుకోకముందే ‘ఫీజుల’ వేట.. ప్రైవేట్ స్కూళ్ల నిలువు దోపిడీ!
Special Stories

​Private School Fee | బడులు తెరుచుకోకముందే ‘ఫీజుల’ వేట.. ప్రైవేట్ స్కూళ్ల నిలువు దోపిడీ!

​Private School Fee | మరికొన్ని రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం (2026-27) ప్రారంభం కానుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు మళ్లీ ఫీజుల వేట మొదలుపెట్టాయి. బడులు ఇంకా తెరుచుకోకముందే అడ్మిషన్లు, పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరిట సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల జేబులకు భారీ చిల్లు పెడుతున్నాయి. ప్రభుత్వ జీవోలు, కోర్టుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రైవేట్ స్కూళ్ల ‘ఫీజు’ రాజ్యం నిరంకుశంగా సాగుతోంది. ​Private School Fee : 20% నుండి 30% పెరిగిన ఫీజులు.. నో డొనేషన్, నో సీట్! ​గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫీజులను ఏకంగా 20% నుండి 30% వరకు పెంచేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ​ప్రాథమిక తరగతులకే రూ. 50 వేల నుండి రూ. 1 లక్ష వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. ​హైస్కూల్ విద్యార్థులకు అయితే టెక్నో, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటూ స్కూలు స్థాయిని బట్టి రూ. 1.5 లక్షల నుండి రూ. 3 l...
తెలంగాణను వణికిస్తున్న వడగాల్పులు: ఒక్కరోజే 61 మంది, నాలుగు రోజుల్లో 168 మంది బలి!
Special Stories

తెలంగాణను వణికిస్తున్న వడగాల్పులు: ఒక్కరోజే 61 మంది, నాలుగు రోజుల్లో 168 మంది బలి!

​తెలంగాణ రాష్ట్రంలో ఎండలు నిప్పుల చెలమను తలపిస్తున్నాయి. భానుడి భగభగలకు రాష్ట్రం విలవిలలాడుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పుల (Heat Waves) కారణంగా జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. వడదెబ్బ తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కరోజే 61 మంది మృతి చెందడం పరిస్థితి భీకరతకు అద్దం పడుతోంది. గత నాలుగు రోజుల్లోనే మరణించిన వారి సంఖ్య 168కి చేరడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ​మరికొద్ది రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ​జిల్లాల్లో నిప్పుల కొలిమి ​రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 6 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం...
పీసీసీ చీఫ్ టార్గెట్‌గా తెరవెనుక రాజకీయం – Telangana Congress
Special Stories

పీసీసీ చీఫ్ టార్గెట్‌గా తెరవెనుక రాజకీయం – Telangana Congress

మహేష్ కుమార్ గౌడ్‌పై ముప్పేట దాడి.. అసలు కథేంటి? ​తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress) లో అంతర్గత పరిణామాలు ఒక్కసారిగా హీటెక్కాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వం, పార్టీ సమన్వయకర్తగా సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారం రేగుతోంది. ఒక వైపు నామినేటెడ్ పదవుల భర్తీ, వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికపై కసరత్తు జరుగుతుండగానే, ఆయనను టార్గెట్ చేస్తూ వస్తున్న కొన్ని మీడియా కథనాలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ​Telangana Congress : మీడియాలో ముప్పేట దాడి.. అసలు కథేంటి? ​ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక ప్రముఖ తెలుగు శాటిలైట్ న్యూస్ ఛానల్‌లో గత రెండు రోజులుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వైఫల్యాలపై వరుస కథనాలు రావడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది. ఆయనను "సమర్థవంతమైన నాయకుడు కాదు" అనే కోణంలో ప్రచారం చేయడం వెనుక పార్ట...
​Land Scam | అక్రమాల ‘డీఐ’.. అవినీతి ‘పానీయం’!
Special Stories

​Land Scam | అక్రమాల ‘డీఐ’.. అవినీతి ‘పానీయం’!

​అటెండర్ టు డీఐ ప్రమోషన్ విద్యా అర్హతలపై నీలినీడలు? ​ఎల్కతుర్తిలో సర్వే నెంబర్ మార్పిడికి భారీగా ముడుపులు! ​ముచర్ల చెరువులోని పట్టా భూమి వ్యవహారంలో ‘లకారాలు’ చేతులు మారినట్లు గుసగుసలు​సదరు అధికారికి కాదేదీ అవినీతికి అనర్హం. చిన్న ఫైలు కదలాలన్నా, పెద్ద భూమి వ్యవహారం చక్కబడాలన్నా అక్కడ ‘ముడుపుల పానీయం’ తాగాల్సిందేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటెండర్ స్థాయి నుంచి డీఐ (డివిజనల్ ఇన్‌స్పెక్టర్/భూ రికార్డుల తనిఖీ అధికారి) స్థాయికి ఎదిగిన సదరు అధికారి ప్రమోషన్ విద్యా అర్హతలపైనే ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లంచాలనే పానీ(నీళ్ల)లా మింగేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు రెవెన్యూ (Revenue Department), సర్వే శాఖల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఎల్కతుర్తి (Elkathurthi), ముచర్ల (Mucharla)పరిధిలో జరిగిన కొన్ని భూ భాగోతాలు (Land Scam) ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ​అర్హ...
CJP | సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ! అసలెందుకు ఇంతలా ట్రెండ్​ అవుతోంది?
Special Stories

CJP | సామాజిక మాధ్యమాల్లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ సునామీ! అసలెందుకు ఇంతలా ట్రెండ్​ అవుతోంది?

​దేశంలో ఒక సరికొత్త డిజిటల్ రాజకీయ విప్లవం తెరపైకి వచ్చింది. సీరియస్ రాజకీయాలకు భిన్నంగా.. వ్యంగ్యం, మీమ్స్ ఆయుధాలుగా పుట్టుకొచ్చిన ఒక సరికొత్త 'ట్రెండ్' ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అదే "కాక్రోచ్ జనతా పార్టీ" (CJP‌‌ – Cockroach Janata Party). కేవలం ఐదు రోజుల్లోనే ఇన్ స్టాగ్రామ్‌లో అధికార పక్షం (BJP) కంటే ఎక్కువ ఫాలోవర్లను సంపాదించుకుని, ఏకంగా 1.5 కోట్లకు పైగా ఫాలోవర్లతో దూసుకుపోతున్న ఈ డిజిటల్ ఉద్యమం వెనుక యువత పెను నిరసన దాగి ఉంది. ​సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో రగిలిన మంట ​ఈ ఉద్యమానికి బీజం పడింది 2026 మే 15న జరిగిన ఒక సుప్రీంకోర్టు విచారణలో ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు సందర్భంగా మాట్లాడుతూ.. "ఉద్యోగాలు లేక, వృత్తిలో రాణించలేక కొందరు యువకులు బొద్దింకల్లా, సమాజ పరాన్నజీవుల్లా మారుతున్నారు. వారంతా జర్నలిస్టులు, ఆర్‌టీఐ (RTI) కార్యకర్తలు, సోషల్ ...
error: Content is protected !!