Real Estate | రియల్టర్ల వెంచర్ మాయ..
సర్వే నెంబర్ ఓచోట.. ప్లాట్లు చేసింది మరోచోట..
నాలా కన్వర్షన్ లతో రిజిస్ట్రేషన్ లు చేసి ప్లాట్లు అమ్మకం
అనుమతి లేకుండా వెంచర్ ..చక్రం తిప్పిన కార్పొరేటర్…
Warangal : అనుమతి లేని వెంచర్ (Real Estate Ventures) లు చేయడంతోపాటు, ఆ వెంచర్ లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించడంలో ఆ రియల్టర్లు ఆరితేరిపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి ధన దాహానికి ప్లాట్లు (Flots) కొనే వారితోపాటు, అధికారులు సైతం చిక్కుల్లో పడే అవకాశం లేకపోలేదని ప్రచారం జరుగుతోంది. అక్రమంగా వెంచర్ లు చేయడం,అక్రమ పద్ధతుల్లో అందులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ లు చేపించడం వీరికి పరిపాటిగా మారినట్లు తెలుస్తోంది. సంపాదనే ధ్యేయంగా నాన్ లేఅవుట్ వెంచర్ లు చేసే వీరు అందులోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేపించడం కోసం గతంలో నకిలీ నాలా ప్రొసీడింగ్ లు కూడా సృష్టించడం అప్పట్లో ఓరుగల్లు లో సంచలనం సృష్టించడంతో పాటు ఓ తహశీల్దార్ సైతం ఆ నకిలీ ...