Sub Registrar | సబ్ రిజిస్ట్రార్ సార్ అక్రమాలకు సాక్షాలివిగో..
జీవో నెంబర్ 257 ను తుంగలో తొక్కిన సబ్ రిజిస్ట్రార్
సబ్ రిజిస్ట్రార్ పై ఇంచార్జి డి ఆర్ ఎలా స్పందిస్తారో ?
Warangal News | వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) గా విధులు నిర్వహిస్తున్న సైదులు గుట్టుచప్పుడు కాకుండా జీవో నెంబర్ 257 అతిక్రమించి అక్రమాలకు పాల్పడినట్లు విశ్వసనీయగా తెలిసింది. పైకి సత్యహరించంద్రుడిలా కనిపించే ఈ అధికారి లోలోపల మాత్రం తన వక్రబుద్దితో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి గట్టిగానే దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో విధులు నిర్వహించినప్పుడు జీవో నెంబర్ 257 ను అతిక్రమించి అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసినందుకు గాను సదరు అధికారి పై సస్పెన్షన్ వేటు పడగా ఇప్పుడు మళ్లీ అదే దారిలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేయడం గమనార్హం.
వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ గా గత కొన్ని నెలల క్ర...




