Tahsildar | సర్వే నెంబర్ 401 కథేంటి?
చర్చనీయాంశంగా హసన్ పర్తి తహశీల్దార్ లీలలు..
కాసులు కురిపించిన నాలా కన్వర్షన్ లు..?
Hanmakonda : ఆ తహశీల్దార్ (Tahsildar) లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి, సదరు తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలు మంత్రి కి సైతం ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సదరు తహశీల్దార్ గురించే మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ శాసనసభ ఎన్నికల కు ముందు బదిలీల్లో భాగంగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి విధుల్లో చేరినప్పటినుండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న అక్రమ(అనుమతి లేని)వెంచర్ (Illegal venture) లలోని ప్లాట్లను వేంచర్ నిర్వాహకులకు అనుకూలంగా గజాల వారీగా ప్లాట్లను కన్వర్షన్ చేసి పెద్దమొత్తంలో ముడుపులు దండుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా ఎప్పటినుండో వివాదాస్పదంగా ఉన్న ఓ భూమి నుండి 8 గుంటలు నాలా కన్వర్షన్ చేయడం ఇప్...




