KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు.
రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...