Sarkar Live

State

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project
Trending, Hyderabad, Sports

హైదరాబాద్‌-చెన్నై బుల్లెట్ ట్రైన్: తెలంగాణలో రూట్ పూర్తిగా మార్పు.. సగానికి తగ్గిన దూరం! – Bullet Train Project

హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ రైలు కారిడార్‌ (Hyderabad- Chennai Bullet Train )కు సంబంధించి తెలంగాణలో ఎలైన్‌మెంట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కోరిన విధంగా నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (NHSRCL) పాత రూట్‌ను కాదని, సరికొత్త ప్రతిపాదనలతో సర్వే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మార్పుల వల్ల తెలంగాణ పరిధిలో ప్రాజెక్టు దూరం మరియు భూసేకరణ అవసరాలు గణనీయంగా తగ్గనున్నాయి. సగానికి తగ్గిన దూరం.. భారీగా సేవ్ కానున్న నిధులు! మొదట ఈ కారిడార్‌ను శంషాబాద్‌ నుంచి బాటసింగారం, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా నిర్మించాలని భావించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు చేపట్టిన తాజా సర్వేలో మార్గాన్ని పూర్తిగా మార్చేశారు. ఈ కొత్త ఎలైన్‌మెంట్‌ ప్రకారం ప్రాజెక్టు దూరం, భూసేకరణ వివరాలు ఇలా మారాయి: వివరాలుపాత ఎలైన్‌మెంట్ (ఖమ్మం రూట్)కొత్త ఎలైన్‌మెంట్ (నల్గొండ ర...
కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు!
State, warangal

కాజీపేటలో ‘రైళ్ల’ తయారీ షురూ: పూర్తి కావచ్చిన మెగా యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు!

Kazipet Railway Unit | తెలంగాణ రవాణా రంగ ముఖచిత్రాన్ని మార్చబోయే కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) పనులు దాదాపు పూర్తి కావచ్చాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు. త్వరలోనే ఈ యూనిట్‌లో అత్యాధునిక 'ఇంటర్‌ సిటీ రైళ్ల' తయారీ ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. న్యూఢిల్లీలో కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ ప్రగతిపై నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో మంత్రి ఈ కీలక వివరాలను పంచుకున్నారు. ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లు.. స్వల్ప దూర ప్రయాణాలకు వరం! రానున్న ఐదేళ్ల కాలంలో కాజీపేట యూనిట్ నుండి ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప దూర ప్రయాణాల (Short-distance travel) కోసం ఈ రైళ్లను పెద్ద ఎత్తున వినియోగించనున్నట్లు రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్థానికంగా వ...
Rains | అన్నదాతకు కన్నీటి ‘వర్షం’: రాష్ట్రవ్యాప్తంగా తడిసి ముద్దయిన ధాన్యం.. కొట్టుకుపోయిన వడ్ల కుప్పలు!
State

Rains | అన్నదాతకు కన్నీటి ‘వర్షం’: రాష్ట్రవ్యాప్తంగా తడిసి ముద్దయిన ధాన్యం.. కొట్టుకుపోయిన వడ్ల కుప్పలు!

తెలంగాణలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం (Unseasonal Rains) అన్నదాతలను అతలాకుతలం చేసింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం ఇచ్చినప్పటికీ, రైతన్నలకు మాత్రం కోలుకోలేని దెబ్బ తీసింది. రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ (IKP) కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, కల్లాల్లో ఆరబోసిన వరి, మక్క ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో వరద నీటికి వడ్ల కుప్పలు కొట్టుకుపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జగిత్యాల, పెద్దపల్లి మార్కెట్లలో ధాన్యపు రాశులు నదిలా.. జగిత్యాల జిల్లా మెట్‍పల్లి వ్యవసాయ మార్కెట్‍లో ఆరబోసిన వడ్లు, మక్కలు నిన్నటి వర్షానికి (Rains) పూర్తిగా తడిసిపోయాయి. పెద్దపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం వర...
ఏసీబీ వలలో తహశీల్దార్
State

ఏసీబీ వలలో తహశీల్దార్

​అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. లంచం డబ్బుల కోసం బాధితులను వేధిస్తున్న ప్రభుత్వ అధికారుల గుట్టురట్టు చేస్తున్నారు. తాజాగా సోమవారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ తహశీల్దార్ (MRO) సుచరిత ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ​అసలేం జరిగిందంటే..? ​ఒక బాధితునికి సంబంధించిన రెవెన్యూ పనిని పూర్తి చేయడానికి తహశీల్దార్ సుచరిత రూ. 2 లక్షల నగదును లంచంగా డిమాండ్ చేశారు. అంత పెద్ద మొత్తాన్ని ఇచ్చుకోలేక, అవినీతి అధికారికి బుద్ధి చెప్పాలనుకున్న బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహం రచించారు. ​డ్రైవర్ ద్వారా లంచం.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ ​తహశీల్దార్ ఆదేశాల మేరకు ఆమె ప...
​అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా: అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..!
Special Stories, State

​అవినీతి తిమింగలాలపై ఏసీబీ పంజా: అక్రమార్కుల గుండెల్లో రైళ్లు..!

తెలంగాణలో ఏసీబీ దూకుడు.. ఎప్పుడు ఎవరిపై రైడ్ జరుగుతుందోనని అధికారుల్లో టెన్షన్ టెన్షన్! ​వరుస దాడులు, ఆకస్మిక తనిఖీలతో లంచావతారులకు నిద్ర కరవు. తెలంగాణలో అవినీతిని కూకటివేళ్లతో పెకలించేందుకు యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) రూట్ మార్చింది. లంచగొండుల ఆట కట్టించేందుకు అధికారులు తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రంలోని అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా ఏసీబీ అడుగులు పడుతుండటంతో.. ఎప్పుడు ఎవరిపై రైడ్ జరుగుతుందో తెలియక అక్రమార్కులు బిక్కుబిక్కుమంటున్నారు. ​కూకటివేళ్లతో కదులుతున్న అక్రమాస్తుల పుట్టలు.. ​గడిచిన కొన్ని రోజులుగా ఏసీబీ జరుపుతున్న వరుస దాడులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో కేవలం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారిపైనే చర్యలు ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్...
error: Content is protected !!