Orvakal Mobility Valley : ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ పార్క్.. భారీ ప్రణాళికలతో ముందడుగు
Amravati : ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ అభివృద్ధికి ముందడుగు పడింది. ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ (Orvakal Mobility Valley) పేరుతో ఓ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని స్థాపించనుండగా చంద్రబాబు సర్కారు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1,200 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1,800 కోట్ల పెట్టుబడితో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ (Electric vehicle park) ఏర్పాటు కానుంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం ఏమిటంటే..
ఒర్వకల్ మొబిలిటీ వ్యాలీ ( Karnool Orvakal Mobility Valley) లో విద్యుత్ వాహన పరిశ్రమలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ ఈవీ ( (EV) పార్క్‌లో సాంకేతిక పరిశోధన (R&D) కేంద్రాలు, టెస్టింగ్ ల్యాబోరేటరీలు, ప్రముఖ తయ...




