Vande Bharat | వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరులో అదనపు స్టాప్‌లు
హైదరాబాద్: ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు నెలల పాటు రైలు నంబర్ 20707/20708 సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ( Vande Bharat Express) కు ఏలూరు స్టేషన్‌లో అదనపు స్టాప్‌లను కొనసాగించనుంది.
Vizag Vande Bharat Rail : ఏలూరు రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 20707 సికింద్రాబాద్ - విశాఖపట్నం అదనపు స్టాప్ ఫిబ్రవరి 25 నుండి, రైలు నంబర్ 20708 విశాఖపట్నం - సికింద్రాబాద్ ఫిబ్రవరి 26 నుండి అమలులోకి వస్తుంది.
పలు రైళ్ల రద్దు..
దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన మరో వార్త.. హైదరాబాద్ డివిజన్‌లోని మనోపాడ్ - అలంపూర్ రోడ్డు మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా, ఫిబ్రవరి 8, 26 మధ్య కొన్ని రైళ్ల సర్వీసులు పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్ రైల్వే.. సికింద్రాబాద్ - కర్నూలు సిటీ (17023), కర్నూలు సిటీ - సికింద్రాబాద్ (17024) సర్వీసులు పాక్షికంగా రద్ద...




