Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు
Krishna water Dispute Hearing : కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (BRIJESH KUMAR TRIBUNAL) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని ట్రిబ్యూనల్ వెల్లడించింది. ముందుగా 811 టీఎంసీల్లో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాను ముందే తేల్చాల్సిన అవసరముందని ట్రైబ్యునల్ తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు రెండు రాష్ట్రాల వాదనలు వింటామని ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేలుస్తామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెల్లడించింది.
Krishna water Dispute Hearing : కాగా...




