హైదరాబాద్ ORRపై ఏఐ నిఘా: అతివేగం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు చెక్.. 14 ప్రాంతాల్లో MVDS వ్యవస్థ
హైదరాబాద్ చుట్టూ విస్తరించిన ఔటర్ రింగ్ రోడ్ (Hyderabad ORR)పై రోజూ వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. పెరుగుతున్న రద్దీ, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం పాటించడం వల్ల ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేయడం, అతి వేగం (Overspeeding)తో డ్రైవ్ చేయడం, ఒక లేన్ నుంచి మరో దానికి మారినప్పుడు జాగ్రత్తలు పాటించకపోవడం, అలాగే రాంగ్ సైడ్‌లో బైకులు, కార్లు పార్కింగ్ చేయడం తదితర కారణాల వల్ల యాక్సిడెంట్లు (ORR accidents) నిత్యకృత్యమయ్యాయి. వాహనదారుల ఈ ధోరణి వల్ల అనేక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అయితే.. ఈ పరిస్థితిని అరికట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Cyberabad Police) ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) సంస్థ సహకారంతో ఓ బృహత్తర కార్యానికి ముందడుగు వేశారు.
హైస్పీడ్ వల్లే నిత్యం...




