Sarkar Live

State

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి
warangal

ఆదివాసీల ఆత్మగౌరవ ప్రతీక కుంజ రాము: 22వ వర్ధంతి సభలో నేతల నివాళి

ఆదివాసీల స్వయం పాలన, హక్కుల పోరాటంలో తన ప్రాణాలను పణంగా పెట్టిన గొప్ప నాయకుడు, ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ వ్యవస్థాపకుడు కుంజ రాము అని పలువురు ఆదివాసీ సంఘాల నేతలు కొనియాడారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని మోకాళ్లపల్లె గ్రామంలో శనివారం కుంజ రాము 22వ వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు. ఆయన పుత్రుడు కుంజ సూర్యం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సభ్యులు మరియు ఆదివాసీ తోటి తెగ నేతలు పాల్గొని రాము చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాము ఆశయాలే సీతక్కకు మార్గదర్శకం: కొడప రఘు ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ తోటి PVTG సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొడప రఘు మాట్లాడుతూ.. ఆదివాసీల అభ్యున్నతి కోసం పరితపించిన కుంజ రాము ఆశయాలను ఆయన సతీమణి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) కొనసాగిస్తున్నారని తెలిపారు. ఒక సాధారణ ఆదివాసీ మహిళగా ఉద్యమ బాట నుండ...
సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు
warangal

సీతక్కపై విమర్శలు చేస్తే సహించేది లేదు: మాజీ రెడ్కో చైర్మన్‌పై రేగ కళ్యాణి నిప్పులు

ములుగు: తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ ఏరువా అలియాస్ గుంటూరు సతీష్ రెడ్డి తీరుపై ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సతీష్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసం మంత్రి సీతక్కపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. 100 కోట్ల ఖర్చుకు 200 కోట్ల స్కాం ఎలా సాధ్యం? మేడారం ఆలయ ప్రాంగణ నిర్మాణానికి సంబంధించి సతీష్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను రేగ కళ్యాణి తిప్పికొట్టారు. "మేడారం గుడి ప్రాంగణ నిర్మాణానికే వంద కోట్లు ఖర్చు అయితే.. అందులో 200 కోట్ల స్కాం జరిగిందని చెప్పడం నీ అవివేకానికి నిదర్శనం. అద్దాల మేడల్లో ఉంటూ ప్రకటనలు ఇచ్చే నీకు క్షేత్రస్థాయి పరిస్థితులు ఏం తెలుసు?" అని ప్రశ్నించారు. మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఘనత సీతక్కకే దక్కుతుందని ఆమె స్పష...
ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్‌, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ
warangal

ఖిలా వరంగల్‌లో ఘనంగా డా.బి.ఆర్. అంబేద్కర్‌, పూలే దంపతుల విగ్రహాల భూమి పూజ

చారిత్రక ఖిలా వరంగల్ పెట్రోల్ పంప్ చౌరస్తాలో డా. బి.ఆర్. అంబేద్కర్ తో పాటు సామాజిక విప్లవకారులు మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే విగ్రహాల ఏర్పాటుకు బుధవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరిగింది. కొండా దంపతుల ప్రత్యేక సహకారంతో, విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు గుడికందుల క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో 38వ డివిజన్ కార్పొరేటర్ ఉమా దామోదర్, 39వ డివిజన్ కార్పొరేటర్ సిద్ధం రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారితో పాటు ఏకలవ్య రాష్ట్ర అధ్యక్షులు రాయపురం సాంబయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగి ఎలందర్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేరుగు అశోక్ తదితరులు హాజరయ్యారు. మహనీయుల ఆశయాలు స్ఫూర్తిదాయకం ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుల విగ్రహాలను ఇక్కడ ఏర్పాటు చేయడం అభ...
సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
warangal

సురక్షిత ప్రయాణం ఆటో డ్రైవర్ల బాధ్యత: వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్

ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆటో డ్రైవర్ల ప్రధాన బాధ్యత అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఆరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా, నేడు కాజీపేట రైల్వే ఆడిటోరియంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. డ్రైవర్లు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వీడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మితిమీరిన ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీలు సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్...
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ
warangal

ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలి: ఎన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ

సమాజాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారిని తరిమికొట్టడానికి ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు నడుం బిగించాలని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ పిలుపునిచ్చారు. హన్మకొండ పరిధిలోని న్యూశాయంపేట పోచంపల్లిలో, తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం బుధవారం రెండో రోజుకు చేరుకుంది. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇనుగాల రాధిక నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరెత్తిన నినాదాలు - అవగాహన ర్యాలీ శిబిరంలో భాగంగా వాలంటీర్లు గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. "ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలిద్దాం - పచ్చదనాన్ని పెంచుదాం" "ప్లాస్టిక్ వద్దు - ప్రాణాలు ముద్దు" "ప్లాస్టిక్ ను నిషేధిద్దాం - పర్యావర...
error: Content is protected !!