Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్
Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితులయ్యారు. బాంబే హైకోర్టుకు ఇటీవల బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరధ్ (Justice Alok Aradh) స్థానంలో పాల్ బాధ్యతలు చేపడతారు.
నియామక ఉత్తర్వులు జారీ
జస్టిస్ పాల్ సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఈ క్రమంలోనేతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించినట్టు కేంద్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జస్టిస్ సుజోయ్ పాల్ నేపథ్యం ఇదీ…
మధ్యప్రదేశ్‌కు చెందిన జస్టిస్ సుజోయ్ పాల్ 1964న జూన్ 21...




