విస్తరిస్తున్న Seasonal flu ..రాష్ట్రంలో వైరల్ ఫీవర్ల కలకలం
Seasonal flu : తెలంగాణలో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధులు (ILI కేసులు) కేసులు విస్తరిస్తున్నాయి. వైరల్ ఫీవర్ల (viral fevers) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వీటి తీవ్రత హైదరాబాద్ (Hyderabad)లో ఎక్కువ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రెండు వారాలుగా ఆస్పత్రుల్లో అధిక జ్వరం, దగ్గు, శరీరనొప్పులతో వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని అంటున్నారు.
Seasonal flu : ఆస్పత్రుల్లో పెరిగిన రద్దీ
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital), ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ( Osmania General Hospital-OGH), నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ (Fever Hospital), NIMSతో పాటు చిన్న క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు కిటకిటలాడుతున్నాయి. ఈ ఆస్పత్రుల్లో వచ్చేవారిలో తీవ్ర జ్వరం, ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉన్న వారే (patients) ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు తెలి...




