ప్రతి ఫోటోగ్రాఫర్ సంక్షేమమే లక్ష్యం: కుసుమ రమేష్
తెలంగాణ రాష్ట్ర ఫోటో & వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం (TGPVWA) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కుసుమ రమేష్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని రెడీన్ రిసార్ట్ & హోటల్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ రంగాల్లో ఆయన చేసిన కృషిని, సంఘం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గం ఈ పదవిని అప్పగించింది. ఈ సందర్భంగా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్. వెంకట్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు ఎస్.కే. హుస్సేన్, ప్రధాన కార్యదర్శి లడే రవి మాట్లాడుతూ.. కుసుమ రమేష్ వంటి క్రియాశీలక నాయకుడు రాష్ట్ర కార్యవర్గంలో చేరడం వల్ల సంఘం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారంలో ఆయన ముందుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కుసుమ రమేష్ మాట్లాడుత...




