Charlapalli : చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రారంభించిన మోదీ
చర్లపల్లి రైల్వే టర్మినల్ (Charlapalli railway terminal)ను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈ రోజు పర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ టర్నిన్‌ను నిర్మించారు. విమానాశ్రయాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకు రూ. 430 కోట్ల వెచ్ఛించారు. రోజుకు సుమారు 50 వేల మంది ప్రయాణికులకు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పటికే రద్దీతో నిండిన సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన ఈ టెర్మినల్ అనేక రైళ్లను ప్రారంభ కేంద్రంగా రూపాంతరం చెందింది. చెన్నై, ఢిల్లీ, కోలకతా, విశాఖపట్నం వంటి ప్రధాన స్టేషన్లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చార్లపల్లి టెర్మినల్ నుంచి నడుస్తాయి.
Charlapalli railway Station లో అత్యాధునిక సౌకర్యాలు ఇవే…
చర్లపల...




