Sarkar Live

State

Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు
State

Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు

Suryapet : ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా సూర్యాపేటలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ (Ethanol factory)ని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్‌లో ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపడుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీపై స్థానికులు నిర‌స‌న‌లు ముమ్మ‌రం చేశారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా యజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్‌లోని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల నేత‌లు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. Ethanol factory ని మూసివేయండి.. ఇథనాల్ ఫ్యాక్ట‌రీని మూసివేయాలంటూ స్థానికులు, ప్ర‌జాసంఘాల నాయ‌కులు నినాదాలు చేశారు. కాగా ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు ఇథనాల్‌ పరిశ్రమ ఎదుట భారీగా భ‌ద్ర‌తా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసన...
Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..
State

Adilabad | హమ్మయ్య… పులిని పట్టుకున్నారు..

ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు Tiger Trapped in Adilabad | రెండు నెలలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పులిని ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు పులిసంచారంతో 2 నెలలుగా బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటిక్రితమే ఫారెస్ట్ అధికారులు ఆ పులిని పట్టుకున్నట్లు తెలియడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. హమ్మయ్య పులిని బంధించారంట మనకేం భయం అక్కర్లేదని ప్రజలు ఖుషీగా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని సిర్పూర్ సరిహద్దులో పులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు ఆ పులిన మగ పులిగా నిర్ధారించినట్లు సమాచారం. వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన.. కాగా , ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad District )జిల్లా కాగజ్‌నగర్‌ మండలం నజ్రూల్‌నగర్‌లో నవంబర్ 29న పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మి(22)పై దాడి చేసి చంపేసిన స...
leopard : పులి సంచారంతో వణికిపోతున్న గ్రామాలు..
State

leopard : పులి సంచారంతో వణికిపోతున్న గ్రామాలు..

leopard Spotted : తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో పులి సంచారం ప్ర‌జ‌ల్లో వ‌ణుకు పుట్టిస్తోంది. ఇటీవ‌ల కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా, ములుగు జిల్లా కొత్త‌గూడ ఏజెన్సీ ప్రాంతాల్లో పులి సంచ‌రించిన ఆన‌వాళ్ల‌ను అట‌వీశాఖ అధికారులు ఇటీవల గుర్తించారు. వెంట‌నే స‌మీప ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసి మంద‌స్తు జాగ్ర‌త్త‌లుపాటించాల‌ని సూచ‌న‌లు చేశారు. అయితే సోమ‌వారం కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామంలో సోమవారం నీటి ట్యాంకు వద్ద పులి సంచారించ‌డాన్ని చూసి గ్రామస్తులు భ‌యాందోళ‌న‌కు గురయ్యారు. పత్తి పంటను కోస్తున్న కొందరు స్థానిక రైతులు వ్య‌వ‌సాయ‌ బావి సమీపంలో పులి పాద‌ముద్ర‌ల‌ను గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశారు. మొబైల్ ఫోన్‌లలో పులి పాద‌ముద్ర‌ల‌ను పొటోలు తీసి అటవీ అధికారులకు తెలియజేశారు. పులి సంచారంతో గ్రామ‌స్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పులి సంచారాన్ని కుణ్ణంగా పరిశీల...
Elon Musk | ఎలాన్ మ‌స్క్ ఏదైనా చేస్తాడు.. చివ‌రికి..
State

Elon Musk | ఎలాన్ మ‌స్క్ ఏదైనా చేస్తాడు.. చివ‌రికి..

Elon Musk : ప్రపంచ ప్ర‌ఖ్యాతుల్లో ఎలాన్ మ‌స్క్ ఒక‌రు. టెక్ బిలియ‌నీర్‌గా ఉన్న ఆయ‌నకు విశేష గుర్తింపు ఉంది. ప్ర‌తిభావంతులు, ప్ర‌భావిత వ్య‌క్తుల జాబితాలో అగ్రస్థానాన్ని పొందారు. టెక్ ప్ర‌పంచంలో అనేక ఆవిష్క‌ర‌ణ‌లు, అనేక సంచ‌ల‌నాలు సృష్టించ‌డంలో ఘ‌నాపాటి ఆయ‌న‌. త‌న‌దైన‌ వినూత్న ఆలోచ‌న‌ల‌తో ప్ర‌పంచాన్ని అబ్బూర‌ప‌ర్చ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటిఇ. తాజాగా ఎలాన్ మస్క్ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశారు. సంచ‌ల‌నాల ఆవిష్క‌ర్త Elon Musk ఎలాన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన టెక్ అభివృద్ధి శక్తి పారిశ్రామికవేత్త. 1971లో దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయ‌న‌ తన విద్యను అమెరికాలో పూర్తి చేసి, పలు రంగాల్లో పరిశోధనలు చేశారు. టెస్లా కంపెనీని స్థాపించి త‌ద్వారా ఎలక్ట్రిక్ వాహన రంగంలో విప్లవాన్ని సృష్టించారు. స్పేస్‌ఎక్స్ ద్వారా అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. స్పేస్ ఎక్స్ ద్వారా ఆయన మార్స్ ...
Dubai | దుబాయిక‌ని వెళ్లాడు.. చివ‌ర‌కు ఏమ‌య్యాడంటే..!
State

Dubai | దుబాయిక‌ని వెళ్లాడు.. చివ‌ర‌కు ఏమ‌య్యాడంటే..!

Dubai News : అత‌డు చిరు ఉద్యోగి.. చిన్నపాటి ప్రైవేటు కొలువు. అష్ట‌క‌ష్టాలు ప‌డి భార్యా పిల్ల‌ల‌ను పోషించుకుంటున్న వేత‌న జీవి. అంద‌రిలాగే త‌న‌కూ ఓ సొంతిల్లు ఉండాల‌ని ఆశించాడు. అందుకు అప్పు చేశాడు.. ఆ త‌ర్వాత తీర్చ‌లేకపోయాడు. దుబాయిలో ఉద్యోగం చేస్తే బాగా పైస‌లు వ‌స్తాయ‌ని, దీంతో క‌ష్టాలు తీరుతాయ‌ని ఎవరో చెప్ప‌డంతో అక్క‌డికి బ‌య‌ల్దేరాడు. ముంబై దాకా వెళ్లి భార్యా పిల్ల‌ల‌తో మాట్లాడాడు.. ఆ త‌ర్వాత అత‌డి ఫోన్ ఎంత‌కీ క‌ల‌వ‌లేదు. ఎన్నిసార్లు క‌లిపినా స్విచ్చాఫ్ అనే వ‌స్తోంది. రూ. 13 ల‌క్ష‌ల అప్పు కావ‌డంతో.. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామానికి చెందిన 39 సంవత్సరాల తంబాకు శ్రీనివాస్‌ది నిరుపేద కుటుంబం. చిన్న‌పాటి ప్రైవేటు కొలువు చేసి భార్య, ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పోషించుకుంటున్నాడు. ఇదే క్ర‌మంలో అత‌డు సొంతిల్లు క‌ట్టుకున్నాడు. ఇందుకు రూ. 13 ల‌క్ష‌ల అప్పు అయ్యింది. చిన్న‌పాటి జ...
error: Content is protected !!