Sarkar Live

State

ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం
warangal

ఉద్యమకారునికి అండగా పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి: రూ. 50 వేల ఆర్థిక సాయం

గీసుకొండ, వరంగల్ జిల్లా: కష్టాల్లో ఉన్న ఉద్యమకారులను ఆదుకోవడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి చాటిచెప్పారు. గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ఉద్యమకారుడు కోట ప్రవీణ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అతని వైద్య ఖర్చుల నిమిత్తం బాలకిశోర్ రెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. పారిశ్రామికవేత్త అల్లం బాలకిశోర్ రెడ్డి అందుబాటులో లేని కారణంగా, వారి ప్రతినిధిగా గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజకుమార్ స్వయంగా వెళ్లి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సందర్భంగా రాజకుమార్  మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు ఏ కష్టం వచ్చినా బాలకిశోర్ రెడ్డి తోపాటు  తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం చేసినందుకు గీసుకొండ మండల ఉద్యమకారులు అల్లం బాలకిశోర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెల...
కాంగ్రెస్‌కు భారీ షాక్: పార్టీకి జీవన్‌ రెడ్డి గుడ్‌ బై.. రాజీనామా లేఖలో సంచలన నిజాలు! – Jeevan Reddy Resigns Congress
State

కాంగ్రెస్‌కు భారీ షాక్: పార్టీకి జీవన్‌ రెడ్డి గుడ్‌ బై.. రాజీనామా లేఖలో సంచలన నిజాలు! – Jeevan Reddy Resigns Congress

Jeevan Reddy Resigns Congress | ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ ఉద్ధండుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి స్వస్తి పలికారు. ఈ నెల మార్చి 25న తాను అధికారికంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటిస్తూ, పార్టీని వీడటానికి గల కారణాలను వివరిస్తూ ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 20 నెలల మానసిక క్షోభ: లేఖలో ఆవేదన తన రాజకీయ సహచరులు, అభిమానులను ఉద్దేశించి రాసిన లేఖలో జీవన్ రెడ్డి కీలక విషయాలను ప్రస్తావించారు. "గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నాను. ఆత్మాభిమానాన్ని చంపుకుని, గౌరవం లేని చోట ఇంకా కొనసాగడం నా వల్ల కాదు. ఈ మానసిక క్షోభను అనుభవిస్తూ పార్టీలో ఉండలేను" అని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ నేత జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రా...
భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 
warangal

భద్రకాళి మాడ వీధుల అభివృద్ధికి మేము అడ్డు కాదు – కానీ స్థానికులకు అన్యాయం చేస్తే సహించం 

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై చెరబండరాజు నగర్ కాలనీ వాసుల ధ్వజం హన్మకొండ: భద్రకాళి దేవస్థాన మాడ వీధుల అభివృద్ధి పేరుతో గత 23 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్న బండ కార్మికుల కుటుంబాలను ఖాళీ చేయించి, బయటి వ్యక్తులకు లబ్ధి చేకూర్చాలని చూడటం దుర్మార్గమని చెరబండరాజు నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని స్థానికేతరులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేను నిలదీస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేకు కాలనీ వాసుల సూటి ప్రశ్నలు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పట్టా పొంది, అక్కడ నివసించే వారికే ఆ హక్కు వర్తిస్తుంది. కానీ, ఇక్కడ నివాసం లేని వారికి ఏ ప్రాతిపదికన లబ్ధి చేకూరుస్తున్నారు? కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు, ...
Telangana Budget 2026-27 : రూ. 3.24 లక్షల కోట్లతో ‘ప్రజా క్షేమం – సామాజిక న్యాయం’.. రైతులకు, విద్యకు పెద్దపీట!
State

Telangana Budget 2026-27 : రూ. 3.24 లక్షల కోట్లతో ‘ప్రజా క్షేమం – సామాజిక న్యాయం’.. రైతులకు, విద్యకు పెద్దపీట!

Telangana Budget 2026-27 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 3,24,234 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘ప్రజా క్షేమం - సామాజిక న్యాయం’ అనే నినాదంతో సామాన్యుల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఈ బడ్జెట్ అద్దం పడుతోందని ప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ స్వరూపం మొత్తం బడ్జెట్: రూ. 3,24,234 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ. 2,34,406 కోట్లు మూలధన వ్యయం: రూ. 47,267 కోట్లు కొత్త రుణాలు: రూ. 73,383 కోట్లు (ప్రతిపాదిత) Telangana Budget 2026-27 : ప్రధాన ఆకర్షణలు & పథకాలు 1. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి పేద కుటుంబానికి ధీమా కల్పించేలా రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రకటించి...
విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!
Hyderabad

విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!

హైదరాబాద్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు మిశ్రమ ఫలితాలను చూపుతున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయగా, కీలకమైన వ్యవసాయం, సాగునీటి రంగాల్లో నిధుల కోత విధించడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే పలు శాఖల కేటాయింపుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆశాజనకంగా విద్య, వైద్య రంగాల కేటాయింపులు సామాజిక మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా శాఖ: గత ఏడాది ₹23,108 కోట్లు ఉండగా, ఈసారి దీనిని ఏకంగా ₹26,674 కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖ: వైద్య రంగానికి గతంలో కంటే సుమారు 1,300 కోట్లు అదనంగా కేటాయించి, మొత్తాన్ని ₹13,679 కోట్లకు చేర్చారు. గ్రామీణాభివృద్ధి: పంచాయతీ రాజ్ శాఖకు ఈసారి ₹33,688 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌లో ఇది ₹31,605 కోట్లుగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు నిరాశే.. అన్నదాతకు అ...
error: Content is protected !!