Sarkar Live

State

నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట
Crime, Hyderabad

నోటీసుల కోసం ‘మామూళ్ల’ వేట

లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఎస్ఐల అరెస్ట్. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కాయి. బాబునాయక్, ప్రమోద్ అనే ఇద్దరు ఎస్ఐలు ఒక కేసు విషయంలో నిందితుడికి సెక్షన్ 41 నోటీసులు ఇచ్చేందుకు ప్రతిఫలంగా లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారు.ఈ వేధింపులను తట్టుకోలేక బాధితుడు ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, ఎస్ఐలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు....
వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..
warangal

వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆయన విజయం కొత్తగూడెం గ్రామంతో పాటు సంగెం మండల ప్రజలకు గర్వకారణంగా మారింది. సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం వీరస్వామి, సోమలక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ వాసం శ్రీనివాస్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై రసాయన శాస్త్రంలో జూనియర్ లెక్చరర్‌గా తన ఉపా...
Women’s Day | మహిళా దినోత్సవ ప్రత్యేక కవిత: ‘మంజుల అనే నేను’.. అబల కాదు, మార్పుకు తొలి అడుగు నేను!
State

Women’s Day | మహిళా దినోత్సవ ప్రత్యేక కవిత: ‘మంజుల అనే నేను’.. అబల కాదు, మార్పుకు తొలి అడుగు నేను!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మార్చి 8, 2026 Women's Day 2026 | ఒక మహిళ ఎదుగుదల వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో అవమానాలు ఉండవచ్చు. కానీ, వాటన్నింటినీ తట్టుకుని నిలబడినప్పుడే అసలైన నాయకురాలు జన్మిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, సామాజిక కార్యకర్త మరియు మాజీ ఆలేరు ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి గారు తన అంతరంగాన్ని కవితా రూపంలో ఆవిష్కరించారు. 'మంజుల అనే నేను' పేరుతో ఆమె రాసిన ఈ కవిత ప్రతి మహిళలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మంజుల అనే నేను గాయాల్ని గుండెల్లో దాచుకుని గర్వంగా నవ్వడం నేర్చుకున్నాను! పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను! నిశ్శబ్దంగా కనిపించినా నిర్ణయాల్లో గర్జించే శక్తిని నేను! నేను మహిళను మాత్రమే కాదు మార్పుకు మొదటి అడుగు నేను! నన్ను ఆపాలని ప్రయత్నించిన చేతులు ఇప్పుడు నా విజయానికి చప్పట్లు కొడుతున్నాయి! నన్ను ఆపాలని వచ్చిన చీకట్లు ...
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా
Hyderabad

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్
warangal

బీసీలకు అన్యాయం చేసినట్లే.. నాయిని భరత్

తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను బీసీ వర్గాలకు కేటాయించకపోవడం అన్యాయమని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ విమర్శించారు. రాష్ట్రంలో బీసీలు అధిక శాతం ఉన్నప్పటికీ వారికి రాజ్యసభలో తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తెలిపారు. సామాజిక న్యాయం పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీసీల డిమాండ్లను పట్టించుకోకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. ఖాళీ స్థానాలను బీసీలకు కేటాయిస్తే వారి సమస్యలు జాతీయ స్థాయిలో ప్రస్తావనకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునర్విమర్శించి భవిష్యత్తులో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని నాయిని భరత్ హెచ్చరించారు....
error: Content is protected !!