పీసీసీ చీఫ్ దౌత్యం విఫలం.. రేపు కీలక నిర్ణయం ప్రకటించనున్న సీనియర్ నేత జీవన్‌రెడ్డి
Jeevan Reddy Congress Resignation | కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పాటు విధేయుడిగా ఉన్న మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. మంగళవారం జగిత్యాలలోని ఆయన నివాసంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సాకేవత్, విప్ ఆది శ్రీనివాస్ జరిపిన చర్చలు ఫలించలేదు. పార్టీని వీడొద్దని వారు కోరినప్పటికీ, తన ఆవేదనకు పరిష్కారం లభించలేదని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు.
అధాష్టానాన్ని ప్రశ్నించిన జీవన్‌రెడ్డి
భేటీ అనంతరం జీవన్‌రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూలబాట కాదని, ముళ్ల బాట అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాబట్టి సీఎం అయ్యారు, భట్టి విక్రమార్క సీఎల్పీ నేత కాబట్టి డిప్యూటీ సీఎం అయ్యారు. నేను మండలిలో పక్ష నేతను కదా? మరి నాకెందుకు అన్యాయం చేశారు?" అని ఆయన సూటిగా ప్రశ...




