రేపే కాళేశ్వరంలో ‘సరస్వతీ అంత్య పుష్కరాల’ ప్రారంభం – Saraswathi Antya Pushkaralu
Saraswathi Antya Pushkaralu Kaleshwaram 2026 | కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరిగే అత్యంత ప్రతిష్టాత్మక ‘సరస్వతీ అంత్య పుష్కరాలకు’ సర్వం సిద్ధమైంది. మే 21వ తేదీ (గురువారం) నుంచి జూన్ 1 వరకు మొత్తం 12 రోజుల పాటు ఈ పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ముక్కోటి పుణ్యతీర్థానికి సుమారు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అంచనా వేసిన ప్రభుత్వం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ. 30.63 కోట్ల నిధులతో భారీ ఎత్తున పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
తొలి పుణ్యస్నానం ఎప్పుడంటే?
పుష్కరాల తొలిరోజైన 21వ తేదీ తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి, రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాలు గోదావరి-సరస్వతీ నదిలో పుష్కర స్నానం ఆచరించి, ఈ అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. మే 21 నుంచి జూన్ 1 వరకు ప్రతి రోజూ దేశంలోని ఒక ప్రముఖ పీఠానికి ...




