Sarkar Live

State

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election
State, Hyderabad

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “ఓటు చోరీ” వివాదం — ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు! Jubilee Hills By-Election

Jubilee Hills By-Election : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “ఓటు చోరీ” ప్రచారం ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌కే తిప్పికొడుతోందన్న చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills By-Election) నేపథ్యంలో యూసుఫ్‌గూడ డివిజన్‌లో భారీ స్థాయిలో నకిలీ ఓటర్లు నమోదైనట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూసుఫ్‌గూడలో ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదైనట్లు తేలింది. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని కృష్ణనగర్ బి బ్లాక్ తాజా ఓటర్ల జాబితా ప్రకారం, బూత్ నంబర్ 246 కింద ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు అయి ఉన్నారు. అంతేకాకుండా ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో ఓటర్లను నమోదు చేసుకుంటున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయి. BRS ప్రతినిధి వై సతీష్ రెడ్డి ఎక్స్‌లో ఇలా పోస్ట్ చేశారు, “వేలాది మందిలో ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. (ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు) ఇక్క‌డి ఓటరు, జాగ్రత్తగా చూ...
Warangal | వరంగల్, నల్గొండలో ఇంక్యూబేషన్ సెంట‌ర్స్‌
State, warangal

Warangal | వరంగల్, నల్గొండలో ఇంక్యూబేషన్ సెంట‌ర్స్‌

తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు Warangal | త్వరలోనే వ‌రంగ‌ల్‌ కాకతీయ విశ్వ‌విద్యాల‌యం (Kakatiya University), నల్ల‌గొండ‌లోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ల‌ను (Incubation Centers) ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు (Minister Sridhar babu) వెల్ల‌డించారు. తెలంగాణను "ఇన్నోవేషన్ హబ్" గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేర‌కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ… సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ...
Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..
State

Heavy Rains | వ‌చ్చే నాలుగు రోజులు కుండ‌పోత‌ వ‌ర్షాలు..

11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం Heavy Rains in Telangana | తెలంగాణ‌లో రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతోంద‌ని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని వెల్ల‌డించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చ‌రించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది. ఈమేర‌కు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే ప్ర‌మాద‌ముంద‌ని తెలిపింది. ఇక శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర...
TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…
State, Hyderabad

TG | స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్…

ఎన్నికల నోటిఫికేషన్, జీవో నంబర్ 9పై స్టే విధించిన హైకోర్టు… TG News | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు (Telangana Local Body Elections) బ్రేక్ పడింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బుధ, గురువారాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం… స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ ద...
KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌
State, Hyderabad

KTR | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‘చలో బస్‌భవన్‌’ ఆందోళన.. కేటీఆర్‌, హరీష్‌ రావు హౌస్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ర‌ద్దు చేసుకోవాల‌ని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌గురువారం 'చలో బస్‌భవన్‌' కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగి. బీఆర్‌ఎస్‌ నేతలను హౌస్‌ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయమే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR ), మాజీ మంత్రి హరీష్‌ రావు(Harish Rao)ను పోలీసులు గృహ‌నిర్బంధం చేశారు. ఈ క్రమంలో కోకాపేటలోని వారి నివాసాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, చలో బస్‌భవన్‌ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR), మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్‌ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్‌ వరకు వెళ్లాలని నిర్ణ‌యించుకున్నారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు వ...
error: Content is protected !!