BRS vs Congress | నీటి ప్రాజెక్టుల భద్రతపై కాంగ్రెస్ నిర్లక్ష్యం సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
BRS vs Congress : భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress govt)పై ఫైర్ అయ్యారు. తెలంగాణలోని ముఖ్యమైన నీటి పారుదల ప్రాజెక్టుల భద్రత పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. ముఖ్యంగా జూరాల, మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రమాద హెచ్చరికలు (danger warnings) వెలువడినా వాటిని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మాత్రమే రాజకీయం
కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లోని మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయనే కారణంగా కాంగ్రెస్, బీజేపీలు నిరంతరం విమర్శలు చేస్తున్నాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. అదే సమయంలో ఇతర ప్రాజెక్టులలో కూడా మరమ్మతులు అవసరమయ్యే పరిస్థితి ఉన్నా వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతి ప్రాజెక్ట్‌కూ కాలానుగుణంగా మరమ్మతులు అవసరం అవు...




