Heavy Rains | వచ్చే నాలుగు రోజులు కుండపోత వర్షాలు..
11న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
Heavy Rains in Telangana | తెలంగాణలో రాబోయే నాలుగు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తెలంగాణ, ఏపీ మీదుగా ద్రోణి కొనసాగుతోందని.. దీనికి ఉపరితల ఆవర్తనం తోడైందని వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి ఈనెల 11నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. దీంతో వచ్చేవారం మళ్లీ కుండపోత వర్షాలు తప్పవని పేర్కొన్నది.
ఈమేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Heavy Rains) కురిసే ప్రమాదముందని తెలిపింది. ఇక శనివారం, ఆదివారాల్లో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర...




