Sarkar Live

State

తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..
Hyderabad

తెలంగాణ లో నామినేటెడ్ పదవుల జాతర షురూ..

కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది ​బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ - బస్వరాజ్ శ్రీనివాస్ ​వాషర్‌మెన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ - దాసరిరాజు అజయ్ కుమార్ ​గీత కార్మికుల కార్పొరేషన్ చైర్మన్ - ముతుకూరి చంద్రశేఖర్ గౌడ్ ​మెరిక సహకార కార్పొరేషన్ చైర్మన్ - దొంగరి వెంకటేశ్వర్లు ​మేదర సహకార కార్పొరేషన్ చైర్మన్ - సంగ వెంకట్రాజం ​వాల్మీకి బోయ సహకార కార్పొరేషన్ చైర్మన్ - గట్టు తిమ్మప్ప ​మున్నూరు కాపు సహకార కార్పొరేషన్ చైర్మన్ - బొమ్మ శ్రీరామ్ ​యాదవ సహకార కార్పొరేషన్ చైర్మన్ - ఎం. రఘునాథ్ యాదవ్ ​వడ్డెర సహకార కార్పొరేషన్ చైర్మన్ - కుంట రేణుక నారాయణ ​చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ - గూడెం వెంకటరమణ ​కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ - బండి రమేష్ ​పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ - గూడూరు శ్రీనివాస్ ​భట్టరాజ కోఆపరేటివ్ సొసైటీ ఫ...
కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!
warangal

కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఓ చిత్తుకాగితం.. వరంగల్ రైతు సదస్సులో కేటీఆర్ ధ్వజం!

KTR Rythu Sangrama Sadassu Warangal | అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6, బుధవారం వరంగల్ నగరాన్ని వేదికగా చేసుకుని 'రైతు సంగ్రామ సదస్సు' (Rythu Sangrama Sadassu)ను నిర్వహించింది. గ్రీన్ వుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన మైదానంలో జరిగిన ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి సీఎం కాదని, ఆయన ఒక 'ఎగవేతల రేవంత్ రెడ్డి' అని ఎద్దేవా చేశారు. ఒట్టు పెట్టి మోసం చేశారు.. భద్రకాళి అమ్మవారి సాక్షిగా వరంగల్ వచ్చి రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకున్న రేవంత్ రెడ్డి, నేడు ఆ మాట తప్పి రైతులను వంచించారని కేటీఆర్ మండిపడ్డారు. "దమ్ముంటే రేవంత్ రెడ్డి ఏదైనా ఒక గ్రామానికి రావాలి.. ఆ ఊరిలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే, నేను నా ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తాను" అని కేటీఆర్ బహి...
తెలంగాణలో భూముల ధరల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్: విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ!
State, Hyderabad

తెలంగాణలో భూముల ధరల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్: విద్యుత్ అక్రమాలపై సీబీఐ విచారణ!

Telangana Land Rates Hike | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా భూముల ధరల సవరణ మరియు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ అక్రమాలపై కీలక చర్యలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. భూముల ధరల సవరణ (Telangana Land Rates Hike) రాష్ట్రంలో వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు భూముల విలువలను సవరించాలని కేబినెట్ నిర్ణయించింది. అమలు: సవరించిన కొత్త ధరలు ఈ నెల చివరి వారం నుండి అమల్లోకి రానున్నాయి. రేషనలైజేషన్: మార్కెట్ విలువల రేషనలైజేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పరిహారం: రోడ్ల విస్తరణ, ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయే నిర్వాసితులకు శాస్త్రీయ పద్ధతిలో మెరుగైన పరిహారం అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశ్యం. హిల్ట్ పాలసీ: ...
​కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన అయినవోలు బిజెపి నాయకులు
warangal

​కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన అయినవోలు బిజెపి నాయకులు

కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ను ఐనవోలు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బిజెపి సీనియర్ నాయకులు భాస్కర్ తో కలిసి ఆడెపు విక్రమ్ మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ఐనవోలు మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని మంత్రికి బహుకరించి, స్వామివారి ఆశీస్సులు అందజేశారు. 1100 ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర, కాకతీయుల కళావైభవం ఉట్టిపడే ఐనవోలు ఆలయాన్ని వారసత్వ సంపద (Heritage Site) గా గుర్తించాలని మంత్రికి విన్నవించారు. దీనిపై బండి సంజయ్ సానుకూలంగా స్పందించినట్లు విక్రమ్ తెలిపారు.రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని మంత్రి సూచించారు....
ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park
State

ఓరుగల్లు ఖ్యాతిని ప్రపంచానికి చాటనున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’.. – Kakatiya Mega Textile Park

ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం Kakatiya Mega Textile Park | తెలంగాణ వస్త్ర పరిశ్రమకు కొత్త ఊపిరిని, వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకురానున్న ‘కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్’ (కేఎంటీపీ) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. వరంగల్ జిల్లా గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట వద్ద 1,327 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగా ప్రాజెక్టును, ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ప్రపంచస్థాయి సదుపాయాలతో.. 'పీఎం మిత్ర'లో చోటు 2017లో శంకుస్థాపన జరిగి, ప్రారంభ దశలో నెమ్మదిగా సాగిన ఈ పార్కు పనులు, కేంద్ర ప్రభుత్వ ‘పీఎం మిత్ర’ (ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పథకంలో బ్రౌన్ ఫీల్డ్ ప్రాజె...
error: Content is protected !!