Heavy Rains | అలర్ట్.. తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
Rain Alert | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
సోమవారం భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్ ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశ ఉన్నట్లు తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
బుధవారం భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్...