Sarkar Live

State

Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి
Crime, Hyderabad

Hyderabad | టీవీ యాంకర్ స్వేచ్ఛ అనుమానాస్పద మృతి

Hyderabad News | ప్రముఖ తెలుగు టీవీ చానల్‌లో న్యూస్‌ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్‌ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్ హౌస్ లో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో సమాచారం అందింది. ఈమేరకు అక్కడికి వెళ్లి చూడగా.. స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు వెల్లడించారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌తో కలిసి పార్సిగుట్టలోని వైఎస్ఆర్‌ పార్కు సమీపంలో నివాసమున్న స్వేచ్ఛ.. గత నాలుగేళ్లుగా కూతురు (14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొన...
NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
warangal, State

NTR Award | గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు

– సీతక్క చేతుల మీదుగా ఘన సత్కారం Mulugu : సీనియర్ జర్నలిస్ట్‌, రచయిత గడ్డం కేశవమూర్తికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటసార్వభౌముడు, సంచలన రాజకీయ నేత పద్మశ్రీ డా.ఎన్టీ రామారావు స్మారకంగా ఇచ్చే ఎన్టీఆర్ అవార్డు (NTR Award ) ఈసారి కేశవమూర్తికి అందింది. ఈ అవార్డును విజయవాడకు చెందిన 'ఎక్స్ రే సాహిత్య-సాంస్కృతిక సేవా సంస్థ' ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందజేసింది. ప్రముఖ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ తో పాటు కేశవమూర్తి (Gaddam Keshava Murthi) ని కూడా పురస్కరించడం విశేషం. గురువారం ములుగు పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి సీతక్క (Minister Seethakka) స్వయంగా కేశవమూర్తికి అవార్డును అందించారు. ఆమె చేతుల మీదుగా శాలువాతో కేశవమూర్తిని ఘనంగ సపన, మెమెంటోతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజ...
Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్
Karimnagar

Bhagyanagar Express | మొరాయించిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్

Peddaplli News : సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (Bhagyanagar Express) రైలు మరోసారి మార్గమధ్యలో నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Bhagyanagar Expres) పెద్దపల్లి జిల్లా రాఘవపూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద నిలిచిపోయింది. అయితే ఎంతసేపటికీ రైలు కదలలేదు. మరోవైపు అధికారులు సైతం సరిగా స్పందించకపోవడంతో ప్రయాణికులు బస్సుల కోసం కాలినడకన రాజీవ్‌ రహదారిపైకి చేరుకున్నారు. బస్సుల కోసం వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రతీరోజు భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 3.35 గంటలకు సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి బయలురి ఉదయం 10.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుకుంటుంది. ఉదయాన్నే వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు...
Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Hyderabad, State

Hyderabad | మున్సిపల్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Hyderabad : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బుధ‌వారం అధికారులతో సమీక్ష (GHMC Review Meeting) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న తాగునీటి సరఫరా, డ్రైనేజ్, శానిటేషన్, తదితర అభివృద్ధి కార్యక్రమాలపై పురోగతిని సీఎం సమీక్షించారు. సీఎం సూచించిన కీలక అంశాలు: అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెనువెంట‌నే పూర్తి చేయాలి. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ (Dengue), చికున్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టండి. డ్రైనేజ్ ఓవర్‌ఫ్లో ఉండకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. తాగునీరు కలుషితం కాకుండా నిరంతర పర్యవేక్షణ అవసరం. దోమల నివారణకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. భవిష్యత్‌ నగర ద...
Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు
State, Districts

Tiger | ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం: ప్రజల్లో తీవ్ర భయాందోళనలు

ఆదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు పెద్దపులి (Tiger) సంచ‌రిచ‌డం కలకలం రేపుతోంది. పులి తిరుగుతోంద‌ని తెలియ‌డంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల కోసం పంట చేన్లలోకి వెళ్లేందుకు వ‌ణికిపోతు న్నారు. తాజాగా బోథ్ ‌మండలం రఘునాథ్ పూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్ద‌పులి ద‌ర్జాగా నడుచుకుంటూ వెళుతుండగా అటుగా వెళుతున్న కొంద‌రు యువకులు గుర్తించారు. పులుల సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. పెద్ద పులి సంచరిస్తుండటంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. కాగా బోథ్‌ మండల సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు నిర్ధారణ కూడా అయింది. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో పెద్దపులి కనిపించింది. దానికి రెండేండ్ల వయసు ఉంటుందని అధికారులు చెబుతున‌నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. త్వరలో దానిని పట్టుకుంటామని ...
error: Content is protected !!