Rains Forecast | రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు వచ్చే నాలుగు రోజులు వానలు
Rains Forecast : రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల ఐదురోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ద్రోణి ప్రభావం కొనసాగుతుండగా, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని అధికారులు తెలిపారు.
Rains Forecast : జిల్లాల వారీగా వర్ష సూచనలు:
ఆదివారం (జూన్ 8):ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు...




