Heavy Rains | తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ ఈనెల 29వరకు భారీ వర్షాలు
Heavy Rains | రాష్ట్రంలో ఈనెల 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయని. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని పేర్కొంది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది. ఇక సోమవారం వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురిశాయి.
27న ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఈనెల 27న ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ...




