Sarkar Live

State

దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market
Hyderabad, State

దేశంలోనే డ్రీమ్ ప్రాజెక్టుగా కోహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ – Koheda Integrated Market

Koheda Integrated Market | ముఖ్యమంత్రి దేశంలోనే అత్యాధునిక హంగులతో ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కోహెడ వద్ద నిర్మించేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు ప్రారంభించింది. సూమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద మార్కెట్ ను నిర్మించనుంది. అందులో ఆధునిక వసతులతో కూడిన నిర్మాణాలు, కోల్డ్ స్టోరేజ్ లు, షెడ్లు, విశాలమైన రోడ్లు తదితర సౌకర్యాలతో మార్కెట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శుక్రవారం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో కోహెడ మార్కెట్ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఒక రోల్ మోడల్ మార్కెట్ ను నిర్మించాలని నిర్ణయించారని సిఎస్ ఈసందర్భంగా తెలిపారు. వార...
MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

MLC Kavitha : పార్టీ మార్పుపై ఎమ్మెల్సీ కవిత కీల‌క ప్ర‌క‌ట‌న‌

BRS MLC Kavitha | బిఆర్ఎస్ పార్టీలో విబేధాలు కొనసాగుతున్న వేళ సంచలన ఆరోపణలు చేసి రాజకీయంగా తీవ్ర కలకలం రేపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా కీలక ప్రకటన చేశారు. పార్టీ నుంచి తాను బయటకు వస్తున్నట్లు ఒక తెలుగు పత్రికలో వచ్చిన వార్తలను ఆమె తీవ్రంగా ఖండించారు, అవి నిరాధారమైనవని కొట్టిపారేశారు. తనను సంప్రదించకుండానే ఇలాంటి ఊహాజనిత వార్తలు ప్రచురించడం పట్ల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha ) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈమేరకు కల్వకుంటల కవిత Xలో ఒకపోస్టు చేశారు. మూడు రోజుల వ్యవధిలో ఒక స్థానిక పత్రిక వాస్తవ విరుద్ధమైన కథనాలను ప్రచురించిందని కవిత విమర్శించారు. "నా గురించి ఈ వార్తను నన్ను సంప్రదించకుండా ప్రచురించడాన్ని జర్నలిజం లేదా శాడిజం అని పిలవాలా?" అని ఆమె నకిలీ వార్తలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ పోస్టులో సదరు వార్తల క్లిప్పింగ్‌లను కూడా షేర్ చేశారు. కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త...
Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు
Hyderabad, State

Fish Prasadam | చేప మందు పంపిణీకి ఈసారి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు

Hyderabad Fish Prasadam 2025 : ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో లక్షలాది మంది పాల్గొనే చేప ప్రసాదం పంపిణీ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో స‌చివాలయంలో చేప ప్రసాదం పంపిణీపై బుధ‌వారం సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులకు గతేడాది కంటే అదనంగా మరిన్ని ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఈసారి చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్దం చేసినట్లు మ‌త్స్య‌శాఖ‌ అధికారులు మంత్రికి తెలిపారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. క్యూ లైన్ల‌లో ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, మహిళలకు వృద్ధులకు ప్రత్యేక క్యూ లైన...
పంటనష్ట పరిహారం నిధుల విడుదల  – Crop Loss Compensation
State, Hyderabad

పంటనష్ట పరిహారం నిధుల విడుదల – Crop Loss Compensation

Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. డమైనది. రాష్ట్రవ్యాప్తం...
Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే
Hyderabad, State

Special Trains | 44 స్పెషల్‌ ట్రైన్స్‌ ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

Special Trains | రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వారంత‌పు ప్ర‌త్యేక‌ రైళ్లను నడిపించనున్నట్లు వెల్ల‌డించింది. వేస‌వి సెల‌వులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న త‌రుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్న‌ట్లు పేర్కొంది. Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవీ.. విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి జూన్‌ 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వ వెల్ల‌డించింది. విశాఖపట్నం – తిరుపతి (08547) రైలు జూన్‌ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుంది విశాఖపట్నం-తిరుపతి (08548) రైలు జూన్‌ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువ...
error: Content is protected !!