Sarkar Live

State

Telangana Rains | తెలంగాణలో 5 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు
State

Telangana Rains | తెలంగాణలో 5 రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు

Hyderabad : రాబోయే ఐదు రోజుల్లో 50-60 కి.మీ వేగంతో గాలులు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains ) కురుస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈమేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ భారీ వర్షపాతంతో వరదలు, రవాణా అంతరాయం, విద్యుత్తు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని సూచిస్తుంది. వీలైతే పౌరులు ఇంటి లోపలే ఉండాలని సలహా ఇస్తుంది. రుతుపవనాల పురోగతి సంకేతాల కోసం వాతావరణ మార్పును కూడా గమనిస్తున్నారు. వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోకి మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. రాగల మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు దక్షిణ బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలు, పూర్తి అండమాన్ నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని ...
మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway
State, warangal

మండుటెండల్లో ప్రయాణికులకు రైల్వే వినూత్న సేవలు – South Central Railway

Warangal : ఎండలు ఠారెత్తుతున్న వేళ దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో వేసవిలో దాహార్తితో బాధపడుతున్న ప్రయాణికుల వద్దకు తాగునీరు అందించే ఏర్పాట్లు (Summer Water Service) చేసింది. స్టేషన్లలో ప్లాట్ ఫాంలపై నిలిచి ఉన్న రైళ్లలో ప్రయాణికుల వద్దకు నేరుగా రైల్వే సిబ్బంది నీళ్లు తెచ్చి ఇస్తున్నారు. దీంతో రైల్వే శాఖ సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణలోని ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన కాజీపేట రైల్వే స్టేషన్‌లో తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా రైల్వే ప్రయాణికులకు తాగునీటి వసతులు కల్పిస్తున్నారు మరోవైపు రైల్వేల భద్రత విషయమై ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అప్రమత్తమైంది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే జోన్ ప‌రిధిలో ఉన్న రైల్వే స్టేష‌న్ల‌లో భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ప్ర...
Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు
State, Hyderabad

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2 నుంచి భూభార‌తి చ‌ట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గ‌త నెల 14న భూభార‌తి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు (Revenue seminars) నిర్వ‌హించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ...
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!
State

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!

VIP Break Darshan : తిరులమ వేంకటేశ్వరస్వామి భక్తులకు (TTD Devotees) టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల (Tirumala)లో 15వ తేదీ గురువారం నుంచి వీఐపీ సిఫార్సు లేఖలపై (VIP recommendation letters) బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల తిరుమలలో భక్తుల కోలాహలం తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల్లో రద్దీ కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డ...
IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం
Districts

IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం

IMD Report | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. ఈసారి కాస్త ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అండ‌మాన్‌లోకి ప్రవేశించినట్లు మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ ‌దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుప‌వ‌నాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ (IMD ) వెల్లడించింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవ‌కాశం ఉం‌దని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. IMD Report : జూన్ 12 నాటికి తెలంగాణకు రుతుపవనాలు కాగా, సాధారణంగా జూన్‌ 1‌వ తేదీ నాటికి ...
error: Content is protected !!