LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ గడువు మరోసారి పొడిగింపు
LRS Concession | లేఅవుట్ రెగ్యులరైజేషన్ సీమ్ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర సర్కారు మరోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వరకు రాయితీ అవకాశం కల్పించింది.
కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు పలు కారణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును పలుమార్లు పొడిగిస్తున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించ...




