MLA Disqualification Case | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
MLA Disqualification Case : బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు (Disqualification) వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ (Supreme Court Verdic) జరిగింది. ఈ కేసును జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ రోజు విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
కాంగ్రెస్‌లో చేరడం రాజ్యాంగ విరుద్ధం : పిటిషనర్లు
ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం తమ వాదనలు ప్రస్తావించారు. పార్టీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ పదవులను వదిలిపెట్టకుండా కాంగ్రెస్ (Congress)లో చేరడం రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ (BRS) చెందిన పిటిషనర్లు పేర్కొన్నారు. వారు రాజీనామా చేయకుండా ప...




