Ugadi celebrations | అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి.. ఉగాది వేడుకల్లో సీఎం
Telangana Ugadi celebrations : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది శుభాకాంక్షలు (CM Revanth Reddy Ugadi wishes) తెలిపారు. విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ శుభాలు జరగాలని కోరుకున్నారు. అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖల సంయుక్త ఆధ్వర్వంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ రోజు ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలలు అడ్లూరి లక్ష్మణ్, శంకరయ్య, మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీఈ మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
...




