Sarkar Live

State

Rain Alert : మే 7 వరకు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..
State

Rain Alert : మే 7 వరకు ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..

Telangana Rain Alert : హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ హైదరాబాద్ వాతావరన విభాగం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లోని ప్రజలు రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వేడిగాలుల వంటి పరిస్థితుల నుంచే ఉపశమనం పొందవచ్చని తెలిపారు. మే 7 బుధవారం వరకు తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో విస్తృతంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం తన అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇందులో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ తదితర జిల్లాల్లో శనివారం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అదే రోజు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూ...
Hydra : హైడ్రాకు కొత్తగా ప్రత్యేక పోలీస్ స్టేషన్.. మరిన్ని అధికారాలు
State, Hyderabad

Hydra : హైడ్రాకు కొత్తగా ప్రత్యేక పోలీస్ స్టేషన్.. మరిన్ని అధికారాలు

Hydra Police Station : హైదరాబాద్‌ ‌నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేస్తూ.. నీటి వనరులను పరిరక్షిస్తూ హైస్పీడ్ తో దూసుకుపోతున్న హైడ్రా ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా (Hydra) ప్రత్యేక విభాగానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కట్టబెట్టింది. ఈ క్రమంలోహైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 8వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇకపై చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములపై జరిగే అక్రమ ఆక్రమణలపై స్థానికులు లేదా అధికారులు ఫిర్యాదు చేస్తే, హైడ్రా పోలీస్‌ ‌స్టేషన్లలోనే కేసులు నమోదవుతాయి. ఇప్పటివరకు సాధారణ పోలీస్‌ ...
TGSRTC : ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..
State, Hyderabad

TGSRTC : ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..

TGSRTC | హైదరాబాద్ నగర ప్రజలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజల సౌకర్యార్థం ఒక వినూత్నమైన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘మెట్రో కాంబి టికెట్‌’ (metro combi ticket) ను కేవలం రూ.20 కే ప్రవేశపెడుుతున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా జనరల్ బస్ టికెట్ (GBT) మెట్రో ఎక్స్‌ప్రెస్ , సాధారణ నెలవారీ బస్ పాస్ ఉన్నవారు (Bus pass holders) హైదరాబాద్ అంతటా మెట్రో డీలక్స్ బస్సుల్లో (Metro deluxe buses) ప్రయాణించొచ్చు. ఇప్పటికే ఉన్న నెలవారీ పాస్ హోల్డర్లకు అప్‌గ్రేడ్ చేసిన ప్రయాణ ఎంపికను అందిస్తుంది. నామమాత్రపు అదనపు ఖర్చుతో వారు ఎక్కువ సౌకర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఆఫ ఉపయోపడుతుంది. హైదరాబాద్‌లోని అన్ని మెట్రో డీలక్స్ సేవలలో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆర్టీసీలో సమ్మె గుబులు ఇదిలా ఉండగా, ఆర్టీసీ (TGSRTC) కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఆర్టీ...
Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్
State, Hyderabad

Harish Rao | రేవంత్ రెడ్డికి నిలువెల్లా విషం.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్

Harish Rao : రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని, బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని పది గంటలకు విడుదల చేయాల్సిన ఫలితాలను, రెండు సార్లు సమయం మార్చి చివరకు రెండున్నరకు విడుదల చేశారని, ఫలితాల కోసం ఎదురు చూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. రేవంత్ రెడ్డి విద్యార్థులకు చెప్పేది ఇదేనా? అని ప్రశ్నించారు.విద్యార్థుల మెదళ్లలో విషం నింపుతున్న ముఖ్యమంత్రి ఎక్కడా ఉండడని, రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ కు నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపుల...
GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్
Hyderabad, State

GHMC : జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్.వి కర్ణన్

Hyderabad : జిహెచ్ఎంసి (GHMC) కమిషనర్‌గా ఆర్.వి. కర్ణన్ (RV Karnan) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్ అధికారుల బదిలీలలో భాగంగా ఆర్.వి. కర్ణన్.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కొత్త కమిషనర్‌గా నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న కమిషనర్ కె. ఇలంబర్తి నుంచి ఆర్వి కర్ణన్ మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించిన ఆర్.వి. కర్ణన్, హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు వంటి ఆహార సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఆహార భద్రతపై ప్రజలలో అవగాహన పెంచారు. జిహెచ్ఎంసి కమిషనర్ గా కొనసాగిన కె.ఇలంబర్తి జిహెచ్ఎంసి కమిషనర్‌గా తన పదవీకాలంలో నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పౌర సేవల మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్ట...
error: Content is protected !!