2025 Delhi polls | ఆప్-కాంగ్రెస్ కూటమిపై ఊహాగానాలకు తెర… పొత్తుపై కేజ్రీవాల్
2025 Delhi polls : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండబోతోందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ఇతర రాజకీయ పక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఈ రెండు పార్టీల అధినాయకత్వాలు చేసే ప్రకటన ఎలా ఉండబోతుందోననే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. అయితే.. దీనిపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రెండు పార్టీల పొత్తు విషయంలో ఊహాగానాలకు తెరపడింది.
ఎక్స్‌వేదికగా కేజ్రీవాల్ ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind kejriwal) ఈ ఊహాగానాలకు తెరదింపారు. రెండు పార్టీల మధ్య అలయెన్స్ ఉండబోతుందనే అంశంపై స్పష్టమైన ప్రకటన చేశారు. "ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మేం ఒంటరిగానే పోటీ చేస్తాం. ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండ...