Sarkar Live

State

BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..
State, warangal

BRS Silver Jubilee | బీఆర్ఎస్‌లో స‌మ‌రోత్సాహం..

BRS Silver Jubilee బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi-BRS) ఏర్పాటై 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక (Silver Jubilee Celebrations) జ‌ర‌గ‌నుంది. రేపు (ఏప్రిల్ 27న ) వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తి (Elkathurthi)లో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. దీని కోసం ఏర్పాట్ల‌న్నీ పూర్త‌వుతున్నాయి. BRS Silver Jubilee : జోరుగా ప్రచారం ఈ రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ జెండాలు, తోరణాలు కడుతున్నారు. గోడల మీద రాతలు రాస్తున్నారు. పోస్టర్లు అంటిస్తున్నారు. ఇది కేవలం ఒక సభ కాదని, ఒక ఉద్యమంలా మారుతోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద సభ (the largest public meeting in India)ను పెట్టలేదని అంటున్నారు. ఎల్కతుర్తిలో దాదాపు 1300 ఎకరాల్లో ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అందులో 200 ఎకరాలను సభా వేదిక కోసం ప్రత్...
Artificial Intelligence | ఏపీలో అమలు చేయబోయే  ఏఐ గ‌వ‌ర్నెన్స్‌ ప్రయోజనాలేమిటి?
State

Artificial Intelligence | ఏపీలో అమలు చేయబోయే ఏఐ గ‌వ‌ర్నెన్స్‌ ప్రయోజనాలేమిటి?

Artificial Intelligence : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ గవర్నెన్స్ రంగంలో కీల‌క‌ అడుగు వేసింది. మినిమం గవర్నమెంట్ - మాక్సిమమ్ గవర్నెన్స్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence -AI) పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన 20 విభాగాల్లోంచి AI చాంపియ‌న్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఈ వర్క్‌షాప్‌ను వధ్వానీ సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ (WGDT) తో భాగస్వామ్యంగా నిర్వహిస్తున్నారు Artificial Intelligence : చాంపియ‌న్లుగా సీనియ‌ర్ అధికారులు ఈ కార్యక్రమం ద్వారా ఎంపిక అయ్యే శాఖలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 80 శాతం కార్యకలాపాలను AI సాయంతో నిర్వహించేందుకు మార్గం సుగుమ‌మైంది. ఏఐ చాంపియన్స్ అనే పేరుతో సీనియర్ అధికారులను ఎంపిక చేస్తారు. వీరితో పాటు A...
Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం
State

Operation Kagar : ద‌ద్ద‌రిల్లుతున్న దండకారణ్యం

Operation Kagar : తెలంగాణ -ఛత్తీస్‌గఢ్ (Telangana, Chhattisgarh) రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న దట్టమైన దండకారణ్యం ప్రస్తుతం భీకరమైన పోరాట క్షేత్రంగా మారింది. వేల సంఖ్యలో భద్రతా దళాలు కర్రెగుట్టల చుట్టూ బలమైన వలయాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భారీ స్థాయి ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా తనవంతు సహాయం అందిస్తోంది. 'కగార్' (Operation Kagar) అనే పేరుతో కొనసాగుతున్న ఈ సైనిక చర్య ఇప్పుడు తుది దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. Operation Kagar : ముగింపు దశకు చేరుకుంటుందా? సెర్చింగ్ ఆపరేషన్‌ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఇటీవల భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం వారి అభ్యర్థనను పూర్తిగా తిరస్కరించింద‌ని తెలిసింది. ఈ నేప‌థ్యంలోనే గురువారం ఉదయం మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య తీవ్రమైన ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని తె...
Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌  న్యాయ‌పోరాటం
State

Regularization | ఫలించిన టీజీబీ ఉద్యోగుల‌ న్యాయ‌పోరాటం

Regularization : తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (Telangana Grameena Bank)లో 20 ఏళ్లుగా రోజువారీ వేతనంపై పని చేస్తున్న(working on daily wages) 456 మంది తాత్కాలిక ఉద్యోగుల న్యాయ‌పోరాటం ఫ‌లించింది. ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ ఉద్యోగుల్లా పని చేస్తున్నప్పటికీ ఎలాంటి స్థిర ఉద్యోగ హోదా లేకుండా తక్కువ వేతనాలతో ప్రయోజనాలు లేకుండా కొనసాగిస్తూ వచ్చిన యాజమాన్యానికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) గట్టి షాక్ ఇచ్చింది. వీరి స‌ర్వీసులను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల‌ని (regularisation) జస్టిస్ పుల్ల కార్తీక్ ఇచ్చారు. Regularization నిరాక‌ర‌ణ‌ను స‌వాల్ చేస్తూ.. బ్యాంకు (Telangana Grameena Bank)లో పనిచేస్తున్న స్వీపర్లు, మెసెంజర్లు సహా ఇతర ఉద్యోగులు ఏళ్ల‌త‌ర‌బ‌డి తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నారు. వీరిని గత రెండు దశాబ్దాలుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా బ్యాంక్ యాజమాన్యం కొనసాగిస్తోంది. కొత్తగా ఉద్యోగ...
Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
State, Hyderabad

Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heatwave in Telangana : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం (Heatwave) చూపించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు (Heatwave ) వీస్తాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలక...
error: Content is protected !!