Sarkar Live

State

డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ  వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
State

డాక్ట‌ర్‌ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

Hyderabad : డాక్టర్ బీఆర్ అంబేడ్క‌ర్  ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) వీసీగా ఘంటా చక్రపాణి (Ghanta chakrapani )ని నియమిస్తూ  ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నలబై ఏళ్లలో సామాజిక, తెలంగాణ రాజకీయ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా తన కెరీర్ ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రం ఆచార్యులుగా చేరారు. తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో  ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కాగా చక్రపాణి ఈ పదవీలో ముడేళ్లపాటు కొనసాగుతారు. కాగా ఘంటా చక్రపాణి స్వస్థలం కరీంనగర్.  ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపిసి ) పూర్తి చేశ...
Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..
State

Harish Rao | ఇది ప్ర‌జాపాల‌న కాదు.. రాక్ష‌స రాజ్యం.. రేవంత్‌పై హ‌రీష్ రావు ఫైర్‌..

Harish Rao | కాంగ్రెస్ ఏడాది పాల‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్నిస్తున్న బీఆర్ఎస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్టు చేస్తుండ‌డంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇది ప్ర‌జాస్వామ్య పాల‌న కాదు.. రాక్ష‌స పాల‌న అని ఆయ‌న మండిప‌డ్డారు.ఈ మేర‌కు హ‌రీశ్‌రావు ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా..? ఎమర్జెన్సీ పాలనా..? అని సీఎం రేవంత రెడ్డిని నిల‌దీశారు హ‌రీశ్‌రావు. ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తిరిగి కేసు బనాయించార‌ని, ఉదయాన్నే పోలీసులు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి అక్రమగా అరెస్టు చేసేందుకు య‌త్నించార‌ని ఆరోపించారు. ఈ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తే, త‌న‌పై, బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు. అక్రమంగా అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్నారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బె...
Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..
State

Telangana Assembly Sessions | అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు..

Telangana Assembly Sessions : తెలంగాణ శాస‌న స‌భ శీతాకాల సమావేశాలు డిసెంబ‌ర్ 9వ తేదీ నుంచి మొద‌లుకానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 9న ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమ‌వుతాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది. కాగా ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ప్ర‌భుత్వం త‌న‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సమావేశాల్లో పలు కీలక చట్టాలపై చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు, కుల గ‌ణ‌న‌, మూసి ప్ర‌క్షాళ‌న‌, నూతన ఆర్ఓఆర్ చట్టం, బీసీ రిజర్వేషన్ తోపాటుపలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు స‌మాచారం. కాగా సంక్రాంతి పండుగ‌ తర్వాత రైతు భరోసా డ‌బ్బులు రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు మంత్రులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అయితే , దీనికి సంబంధించిన...
నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..
State

నిరుపేద‌ల‌కు గుడ్ న్యూస్.. ఇందిర‌మ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్‌..

Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన‌ మొబైల్ యాప్ ను స‌చివాల‌యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామ‌ని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారి గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమ‌ని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువ‌చ్చి పేదలకు భూములను పంచార‌ని చెప్పారు. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరా గాంధీ పంపిణీ చేశార‌ని తెలిపారు. రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ... ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుంద‌ని త‌మ‌ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దీనిని 5లక్షల రూపాయ‌ల‌కు పెంచింద‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ల...
Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు
State

Tharmal Power Plants | రామగుండం, జైపూర్ లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు

Ramagundam | పెద్దప‌ల్లి జిల్లా రామగుండం, మంచిర్యాల జిల్లా జైపూర్‌లో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు (Tharmal Power Plants ) నిర్మిస్తామ‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు ప్ర‌క‌టించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న రామగుండం థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. త్వరలోనే ఈ విద్యుత్ ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. బుధవారం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వ‌చ్చిన 11 నెలలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చామ‌ని తెలిపారు. నెల రోజుల వ్యవధిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్ల నగదు రైతుల ఖాతాల్లో జమ చేశామ‌ని, బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల‌కు వడ్డీలు కడుతూ ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామ‌న్నారు. కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వ‌రి ధాన్యం ఉత్పత్తికి కృషి చేశామని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార...
error: Content is protected !!