Google | హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ సెంటర్
Google | ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌లో దేశంలోని తొలి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)) ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది. ఏషియా పసిఫిక్ జోన్ లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో అతిపెద్ద సెంటర్ ఇదే కావడం గమనార్హం.. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది హై సెక్యూరిటీ, ఆన్‌లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయనుంది. అత్యాధునిక పరిశోధన, ఏఐ ఆధారిత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకారం అందించే వేదికగా నిలవనుంది.
దేశంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, యువతకు ఉపాధి పెంచడం, సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాలు పెంపొందించేందుకు ఈ సెంట...