BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు
                    KCR | పదేండ్ల పాటు దగదగలాడిన తెలంగాణ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయిందని బిఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. యావత్ భారతదేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని కానీ ఇప్పుడు అసమర్థ నిర్ణయాలు, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప ఎప్పుడూ కూడా కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయక...                
                
             
								
