Road Collapsed | రోడ్డు మధ్యలో ఒక్కసారిగా 20 అడుగుల భారీ గొయ్యి.. కంగుతిన్నస్థానికులు.. ఎక్కడో తెలుసా..!
Road Collapsed in Lucknow | ఉత్తరప్రదేశ్‌లో విస్తుపోయే ఘటన ఒకటి చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని లక్నో(lucknow)లో రోడ్డు మధ్యలో కుంగిపోయింది(Road Caves In ). దీంతో ఒక్కసారిగా 20 అడుగుల లోతైన భారీ గొయ్యి ఏర్పడడంతో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. దీని సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ రోడ్డు కు రెండు వైపులా బారికేడ్లు పెట్టి వాహనాలు అటువైపు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితంగా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో సోమవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. వికాస్ నగర్ ప్రధాన రహదారి వెంట పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందున్న రోడ్డు కుంగిపోయింది. దీంతో అక్కడ ఏర్పడిన 20 అడుగుల లోతులో పెద్ద గొయ్యి చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే మందస్తుగా అక్కడ బారికేడ్లు ఏర్పాటుల చేయడ...